ధర్మపురి, జూన్ 14: తెలంగాణ ప్రభుత్వం ప్రా రంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండ, బు గ్గారం, మద్దునూర్ గ్రామాల్లో పల్లె ప్రగతి, ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.
మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో రూ.3,497.62కోట్లతో 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. వెల్గొండ సర్పంచ్ గాదె తిరుపతి, ఇతర పార్టీలకు చెందిన సుమారు 100 మంది టీఆర్ఎస్లో చేరగా మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీ బాదినేని రాజేందర్, ఎంపీపీ బాదినేని రాజమణి, వైస్ ఎంపీపీ జోగినపల్లి సుచెందర్, ఎంపీటీసీ రెండ్ల లక్ష్మి, సర్పంచ్ గాదె తిరుపతి ఆధ్వర్యంలో, ఎస్ఎంసీ చైర్మన్లు పాతకాల రమేశ్, పెరుక రమేశ్, కో ఆప్షన్ సభ్యుడు రహమాన్ పాల్గొన్నారు.
అడిగిన వెంటనే ట్రైసైకిళ్లు
మంత్రి ఈశ్వర్ అభయమిచ్చారు. ఇద్దరు దివ్యాంగులకు అండగా నిలిచారు. మంగళవారం మద్దునూరులో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి హాజరైన మంత్రిని ఇద్దరు దివ్యాంగులు కలిసి ట్రై సైకిళ్లను కోరగా, వెంటనే స్పందించారు. అధికారులతో మాట్లాడి పర్యటన ముగిసేలోగా ట్రై సైకిళ్లను తెప్పించి అందజేయగా, దివ్యాంగులు మురిసిపోయారు. అమాత్యుడికి కృతజ్ఞతలు చెప్పారు.