చొప్పదండి, జూన్ 14: సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా ఉందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని వెదురుగట్టలో మంగళవారం ఆయన డంప్ యార్డు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాన్ని పరిశీలించారు. అనంతరం మన ఊరు-మన బడి పనులు, గ్రామీణ క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. క్రీడా ప్రాంగణంలో వాలీబాల్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందన్నారు.
సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్ మినుపాల తిరుపతిరావు, సర్పంచ్ గుడిపాటి సుచరితాదేవి, ఎంపీటీసీ రమ్య, ఎంపీడీవో స్వరూప, ఆర్బీఎస్ జిల్లా, మండల కో-ఆర్డినేటర్లు గడ్డం చుక్కారెడ్డి, వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్లు గొల్లపల్లి శ్రావణ్‌కుమార్, గన్ను శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణహరి, నాయకులు నలుమాచు రామకృష్ణ, మాచర్ల వినయ్, కొత్తూరి మహేశ్, గుర్రం హన్మంతరెడ్డి, బత్తిని సంపత్, రవితేజ పాల్గొన్నారు.