జగిత్యాల రూరల్, జూన్ 14: జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు రావడంపై ఎమ్మెల్యే సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం క్యాంపు కార్యాలయం వద్ద పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగిత్యాలలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి నెరవేర్చారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, జగిత్యాల కళాశాలలో మౌళిక వసతులు, ఇతర విషయాలను నేషనల్ మెడికల్ కౌన్సిల్ మూడుసార్లు పరిశీలించి గుర్తింపు ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తొమ్మిది ఉండగా, పదో కాలేజీగా జగిత్యాల నిలిచిందన్నారు. కళాశాల కు భూమి కేటాయింపు, భవనాల నిర్మాణం, మౌళిక వసతుల కల్పన వంటి వాటిలో మం త్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత ఎంతో కృషిచేశాని, ఇప్పుడు కళాశాలకు ఎన్ఎంసీ గుర్తింపు రావడం గర్వంగా ఉందన్నారు. ఎంఎన్సీ గుర్తింపు వచ్చేందుకు సహకరించిన కలెక్టర్ జి. రవి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, మెడికల్ కళాశాల సిబ్బంది అభినందనీయులని కొనియాడారు.