మెట్పల్లి, జూన్14: మెట్పల్లి వ్యవసాయ మార్కెట్‌ను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి అభివృద్ధి పనులపై పాలకవర్గం, సంబంధిత అధికారులు, వ్యాపారులతో సమీక్షించారు. మార్కెట్ యార్డు ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్, నూతన కార్యాలయం భవన నిర్మాణం కోసం రూ.2.95 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రా రంభిస్తామని చెప్పారు. అనంతరం ఆయన షా పింగ్ కాంప్లెక్స్, కార్యాలయం భవనం నిర్మాణానికి సంబంధించి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో స్థల పరిశీలన చేశారు.
సీఎం కేసీఆర్ నే తృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సా ధించిందని పేర్కొన్నారు. షాపింగ్ కాంప్లెక్స్, కా ర్యాలయం భవన నిర్మాణానికి నిధులు మంజూ రు చేయించిన ఎమ్మెల్యేను మార్కెట్ కమిటీ పాలకవర్గం, వ్యాపారులు ఘనంగా సన్మానించారు. ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జరుపుల రాయల్, మున్సిపల్ అధ్యక్షురాలు రాణవేని సుజాత, ఏఎంసీ వైస్ చైర్మన్ పూదరి సుధాకర్‌గౌడ్, మున్సిపల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌రావు, కమిషనర్ సమ్మయ్య, మార్కెట్ కమిటీ కార్యదర్శి రమణ, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మార్గం గంగాధర్, కౌ న్సిలర్ బంగారుకాళ్ల కిషోర్, పీఏసీఎస్ చైర్మన్ లింగారెడ్డి,నాయకులు తదితరులు పాల్గొన్నారు.