కార్పొరేషన్, జూన్ 13: దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, తెలంగాణ పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలు కావాలని ప్రజలు అడుగుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. సోమవారం స్థానిక రాంనగర్లో రూ.35 లక్షలతో చేపట్టనున్న కూరగాయల మార్కెట్ ఆధునీకరణ పనులను ప్రారంభించారు. అనంతరం రూ. 11 లక్షలతో నిర్మించిన ఆధునిక పబ్లిక్ టాయిలెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను ఎప్పుడూ కేసీఆర్‌కు, పార్టీకి సూసైడ్ స్వాడ్‌గా ఉంటానని స్పష్టం చశారు. కేసీఆర్ ఏది ఆదేశిస్తే తు. చ. తప్పకుండా అమలు చేసే బాధ్య త తీసుకుంటానన్నారు. రాబోయే కాలంలో సీఎం కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెంటే ఉం టానని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ శక్తి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ప్రతిపక్షాల్లో ఐక్యతలేకనే బీజేపీకి అవకాశం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ శక్తిగా కేసీఆర్ తయారవుతున్నారని ప్రజలు ఆలోచన చేస్తున్నారన్నారు. తెలంగాణ ఏనిమిదేండ్లలోనే 50, 60 ఏళ్లల్లో జరగని అభివృద్ధిని సాధించిందని, అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. 80 ఏళ్ల బీజేపీ, కాంగ్రెస్ పాలనను దేశ ప్రజలు చూశారన్నారు. 8 ఏళ్లు తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశమంతా కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. గత పాలకులు దేశవ్యాప్తంగా ఎందుకు సాగు, తాగునీరు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. దేశంలో మరో పార్టీ లేకపోవడం వల్ల బీజేపీ లేకపోతే కాంగ్రెస్ అన్నట్లుగా సాగిందని, ఇప్పుడు కేసీఆర్ ప్రత్యామ్నాయశక్తిగా మారుతారని తెలిపారు. దేశ ప్రజలు ఆయన నాయకత్వాన్ని, బీఆర్ఎస్ను ఆదరిస్తారని తెలిపారు.
ఆధునీకరణకే పల్లె, పట్టణ ప్రగతి
పల్లెలు పట్టణాల్లా మారాలని, పట్టణాలు ఆధునీకరణ జరగాలని పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. పట్టణాల్లో ఏండ్ల తరబడి పేరుకపోయిన సమస్యలు పట్టణ ప్రగతిలో పరిష్కరిస్తున్నామన్నారు. మహిళల ఇబ్బందులను తొలగించేందుకు పబ్లిక్ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశామని, వాటిని కూడ పరిశుభ్రంగా ఉంచుతున్నామని తెలిపారు. నగరంలో మహిళల కోసం ప్రత్యేకంగా మూడు పింక్ పబ్లిక్ టా యిలెట్స్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 23 పబ్లిక్ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పింక్ టాయిలెట్స్‌లో పూర్తిగా మహిళలకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. వీధివ్యాపారాలు నిర్వహించుకునేందుకు వీలుగా నగరంలో 5 ప్రాంతాల్లో హైజినిక్ పరిస్థితుల్లో సమీకృత మార్కెట్లను నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే రాంనగర్‌లోని చేపల, కూరగాయాల మార్కెట్‌ను ఆధునీకరణ చేస్తున్నామన్నారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి రెండేండ్లలోనే జరుగుతుందన్నారు. నగరంలో అంతర్గత రోడ్లు, కేబుల్ బ్రిడ్జి మానేరు రివర్ ఫ్రంట్ వేంకటేశ్వర ఆలయం, మెడికల్ కళాశాలతో అన్ని రం గాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వచ్చే ఏడాదిన్నరలో నగర ప్రజలు శభాష్ అనే విధంగా పని చేస్తామన్నారు. ప్రజలు కూడ అభివృద్దిలో భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మేయర్ సునీల్‌రావు, డిప్యూటీ మే యర్ చల్ల స్వరూపారాణీ హరిశంకర్, కార్పొరేటర్లు తోట రాములు, దిండిగాల మహేశ్, కమిషనర్ సేవా ఇస్లావాత్, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ పీ అనిల్‌కుమార్‌గౌడ్, నాయకులు ఆరె రవి, రాజు, శ్రీనివాస్ ఉన్నారు.