ధర్మారం, జూన్ 13: సమైక్య పాలనలో రైతులు అనేక అవస్థలు పడగా నేడు వారి సంక్షేమమే ధ్యే యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య, పాలకవర్గ ప్రమా ణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారు. అక్కడి నుం చి ఆర్టీసీ బస్టాండ్ దాకా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లారు. పట్టణంలో డీఎంఎఫ్టీ నిధులు రూ. 3.10 కోట్లతో నిర్మించే సైడ్‌డ్రైన్, సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏఎంసీ పాలక వర్గ స మావేశానికి హాజరు కాగా మంత్రి సమక్షంలో పాలకవర్గం చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లతో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి ప్రమాణ స్వీ కారం చేయించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ ము త్యాల కరుణశ్రీ అధ్యక్షత జరిగిన సభలో మంత్రి కొప్పుల మాట్లాడుతూ సమైక్య పాలనలో రైతులకు ఎన్నో కష్టాలు పడ్డారని, సీఎం కేసీఆర్ సమస్యలకు ప్రణాళికా ప్రకారం శాశ్వత పరిష్కారం చూపారని చెప్పారు. స్వరాష్ట్రంలో నీటి తీరువాను రద్దు చేశారన్నారు. నీటి ప్రాజెక్టులు నిర్మించడంతో బీడు భూములు సస్యశ్యామలమయ్యాయన్నారు. సాగుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఘన త తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. ధరణి పోర్ట ల్ను తెచ్చి భూ సమస్యలు పరిష్కరించారన్నారు. రైతు బంధు, రైతుబీమాతో అండగా నిలిచారని పేర్కొన్నారు. కేంద్రం ఎన్ని కొర్రీలు పెట్టినా యాసంగి ధాన్యం కొని రూ. 800 నుంచి 1,000 కోట్ల వడ్డీ భరిస్తూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసిన ఘనత తమకే దక్కిందని స్పష్టం చేశారు.
గతంలో మార్కెట్ కమిటీలు అలంకార ప్రా యంగా ఉండేవని, స్వరాష్ట్రంలో మంచి గుర్తింపును తెచ్చామని చెప్పారు. 30 ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టామని, ఈ క్రమంలో మార్కెట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మార్కెట్ యార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం స మర్పించారు. ఈ సందర్భంగా మంత్రిని, మం డల ప్రజా ప్రతినిధులను చైర్మన్ బుచ్చిరెడ్డి సన్మానించారు. మార్కెటింగ్ శాఖ తరపున నూతన పాలకవర్గాన్ని మంత్రి ఈశ్వర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ధర్మారం సర్పంచ్ పూస్కూరు జితేందర్ రావు, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్‌రెడ్డి, డీఎంవో ప్రవీణ్‌రెడ్డి, ఏడీఏ ఎం .శ్రీనాథ్, డైరెక్టర్లు నాడెం శ్రీనివాస్, మంచెర్ల లచ్చ య్య, దేవి వీరేశం, సాగల కొమురేశం, గుండా సత్యనారాయణ రెడ్డి, సందినేని కొమురయ్య, ఎండీ బాబా, రేగుల లక్ష్మీ, అజ్మీరా తిరుపతి నా యక్, మిట్ట సత్తయ్య, యాంసాని మహేశ్, దైత శ్రీనివాస్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పా కాల రాజయ్య, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, ఉప సర్పంచ్ ఆవుల లత, జడ్పీ, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండీ సలామొద్దీన్, ఎండీ రఫీ, ప్యాక్స్ మాజీ చైర్మన్ పూస్కూరు నర్సింగరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్‌రెడ్డి, తహసీల్దార్ ఆర్. వెంకట్ లక్ష్మీ, ఎంపీడీవో బీ జయశీల, ఏవో ఎస్ఎంఎస్ పూర్ణిమ,మార్కెట్ కార్యదర్శి సరోజ ,కార్యాలయ సిబ్బంది , సర్పంచులు ఉన్నారు.