కరీంనగర్, జూన్ 13 (నమస్తే తెలంగాణ):దళితబంధు లబ్ధిదారులకు ఎంపిక చేసిన యూ నిట్లను మంజూరు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో దళిత బంధు పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజూరాబాద్, కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల్లో దళిత బంధు పథకానికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్లను మం జూరు చేయాలని అధికారులను ఆదేశించారు. దళితబంధు యూ నిట్ల పున: పరిశీలనకు ఫిజికల్ ఫామ్స్, రేషన్ కా ర్డులు, ఆధార్ కార్డులు, కొత్తగా వివాహం చేసుకున్న వారి వివరాలు దళిత బంధు సర్వేలో పాల్గొన్న లబ్ధిదారులకు ఉన్నాయో లేదో పరిశీలించి వారి వివరాలు సరిగ్గా ఉంటే దళిత బంధు యూనిట్లను మంజూరు చేయాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, క్లస్టర్ ఆఫీసర్లను కలెక్టర్ ఆదేశించారు. దళిత బంధు పథకంలో భాగంగా మం జూరైన కిరాణా షాపులు, సూపర్ మారెట్లు, వ్యాపారం నడిపించే లబ్దిదారులు సే ల్స్ రిజిష్టర్, స్టాక్ రిజిస్టర్లలో ఎప్పటికప్పుడు న మోదు చేసే విధంగా చూడాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్‌లాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, ము న్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీలత, జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా నెహ్రూ యువ కేంద్రం కో-ఆర్డినేటర్ రాం బాబు, క్లస్టర్ అధికారులు, గ్రౌండింగ్ అధికారులు, ఎంపీడీవోలు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హరితహారంపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొకనూ సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో ప్రభుత్వ స్థలాలు, చెరువు గట్లపై గుంతలు తీసి మొకలను నాటాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా యాదాద్రి తరహాలో రోడ్లకు ఇరువైపులా మొకలను నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. మొకలు లేని చోట కొత్త మొకలు నాటాలన్నారు. మొకల సంరక్షణపై అధికారులకు పలు సూచనలు చేశారు. మొ కలు నాటిన తర్వాత ఊత కర్రలు కట్టి, ట్రీ గా ర్డులను ఏర్పాటు చేయాలని, నాటిన ప్రతి మొ కకూ నీరు అందించేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలతారెడ్డి, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, వెనుకబడిన తరగతుల అధికారి రాజ మనోహర్‌రావు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నతానియేల్, హార్టికల్చర్ డీడీ శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జువేరియా తదితరులు పాల్గొన్నారు.
ఆర్థ్ధిక, సామాజిక ముఖచిత్ర పుస్తకావిష్కరణ
పోటీ పరీక్షలకు సన్నద్ధమ య్యే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ సామాజిక, ఆర్ధిక ముఖచిత్రం 2022 పుస్తకాన్ని కలెక్టర్ ఆర్ వీ కర్ణన్ సోమవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలోని అన్ని రంగాలు, చరిత్ర, తొలి, మలి, చివరి దశ ల ఉద్యమ తీరుతెన్నులను క్లుప్తంగా వివరించారని చెప్పారు. మొదటి ప్రతిని జడ్పీసీఈవో ఆర్ వీ ప్రియాంక కర్ణన్‌కు అందజేశారు. ఉద్యోగార్థులు ఈ పుస్తకాలను కలెక్టర్ కాంప్లెక్స్‌లోని ము ఖ్యప్రణాళికాధికారి కార్యాలయంలో రూ.150 చెల్లించి పొందవచ్చని తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు అన్ని పని దినాల్లో సీపీవోకొమురయ్యను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపగణాంకాధికారి వీ శ్రీనివాస్, కే సపంత్, సహాయ గణాంకాధికారి సుధాకర్‌రెడ్డి ఉన్నారు.