కోల్‌సిటీ, నవంబర్ 14: నియోజక వర్గంలోని కళాకారుల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈమేరకు గోదావరిఖనికి చెందిన టెలీఫిలిం దర్శక, నిర్మాత దామెర శంకర్ సాయితేజ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించి, దర్శకత్వం వహించిన ‘దర్శకుడంటే’ లఘుచిత్రం సీడీని ఆదివారం గోదావరిఖని మా ర్కండేయ కాలనీలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం దర్శకుడు దామెర శంకర్, ఎమ్మెల్యే చందర్‌ను స్థానిక ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎం వంశీ సన్మానించారు. నియర్ అండ్ డియర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పీఎస్ అమరేందర్, కో-ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్, తానిపర్తి గోపాల్ రావు, ఉపేందర్, మంథని సంపత్, రవికిరణ్, మేజిక్ రాజా, కనకం రమణయ్య, గట్టయ్య, సర్వేశ్ తదితరులు ఉన్నారు.
విద్యాభివృద్ధికి అహర్నిశలు..
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, విద్యార్థుల్లో దాగి ఉన్న కళ, సృజనాత్మకతను వెలికితీసేందుకు తెలంగాణ బాలోత్సవ్ 2021 చేపట్టామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా ఆదివారం గోదావరిఖని మార్కండేయ కాలనీ శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో బాలోత్సవ్‌ను ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ అనిల్‌కుమార్, కార్పొరేటర్లు పెంట రాజేశ్, శంకర్ నాయక్, బాల రాజ్‌కుమార్, నాయకులు కాల్వ శ్రీనివాస్, సలీం బేగ్, నీల గణేశ్, కల్వల సంజీవ్, చెల్కలపల్లి శ్రీనివాస్, పీచర శ్రీనివాస్, ఎంఈవో లక్ష్మి, ట్రస్మా నాయకులు సమ్మారావు, రవీందర్ రెడ్డి, యాదగిరి, అమరేందర్ రావు, కొత్త శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.
క్యాన్సర్ బాధితులకు అండగా..
నియోజక వర్గంలోని క్యాన్సర్ బాధితులకు అం డగా అన్ని తామై ఉంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మార్కండేయ కాలనీలోని ఫంక్షన్ హాల్లో 20 మంది క్యాన్సర్ బాధితులకు ఒక్కొక్కరికీ విజయమ్మ ఫౌండేషన్ ద్వారా రూ.500 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇక్కడ నీడ సంస్థ అధ్యక్షుడు పల్లెర్ల రమేశ్ ఉన్నారు.