ధర్మపురి, జూన్13: భూమిని నమ్ముకొని బతికే రైతన్నకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నా రని, సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తూ అనేక పథకాలతో అండగా నిలుస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ధర్మపురి మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి, ధర్మపురి ఏఎంసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. అందరికీ అన్నం పెట్టే రైత న్న ఆత్మగౌరవంతో జీవించేలా వ్యవసాయంలో సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలు చేపట్టి సాగు ను బంగారం చేశారని ఉద్ఘాటించారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడంతో పాటు, ఎకరానికి రూ.10వేల పెట్టుబడి సాయం చేస్తున్నదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం 4లక్షల మెట్రిక్ టన్నుల సామ ర్థ్యం ఉన్న గోదాములు మాత్రమే ఉండేవని, కానీ ఇప్పుడు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 315 గోదాములు నిర్మించుకున్నామని చెప్పా రు.
ఒకప్పుడు బీడు పడ్డ భూములన్నీ ప్రాజెక్టు ల నిర్మాణంతో సస్యశ్యామలమవుతున్నాయని చెప్పారు. మిషన్ కాకతీయతో భూ గర్భ జలాలు పెరిగాయని, ఏ ఊళ్లో చూసినా పసిడి పంటలు పండుతున్నాయని వివరించారు. బీజేపీ సర్కా రు గొప్పలు చెప్పుకుంటున్నదని, ఈ ఎనిమిదేం డ్ల పాలనలో రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒరగబెట్టిందేమి లేదని మండిపడ్డారు. అనంతరం ధర్మపురి ఏఎంసీ చైర్మన్‌గా అయ్యోరి రాజేశ్‌కుమార్, వైస్ చైర్మన్‌గా అక్కనపల్లి సునీల్‌కుమార్‌తో డీఎంఓ ప్రకాశ్ ప్రమాణస్వీకారం చేయించారు. రైతులకు అందుబాటు లో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని స భ్యులకు మంత్రి సూచించారు. ఉమ్మడి జిల్లా డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, బుగ్గా రం ఎంపీపీ రాజమణి, జడ్పీటీసీలు రాజేందర్, అరుణ, ఆర్బీఎస్ కన్వీనర్ భీమయ్య ఉన్నారు.