జమ్మికుంట రూరల్, జూన్ 12: పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత సమయంలోగా పూర్తి చేయించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులకు సూచించారు. ఆదివారం మండలంలోని మడిపల్లి, బిజిగిరిషరీఫ్ గ్రామాలను ఆమె సందర్శించారు. నర్సరీలు, వైకుంఠధామాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలతో పాటు క్రీడా మైదానాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడా మైదానాల పనులు పూర్తి చేసి త్వరగా అందుబాటులోకి తీసురావాలన్నారు. నర్సరీల్లో సిద్ధం చేసిన మొక్కలను నాటేందుకు స్థలాలను గుర్తించాలని చెప్పారు. రోడ్లకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో నాటి సంరక్షించాలని సూచించారు. ఇక్కడ మండల ప్రత్యేకాధికారి నవీన్, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్డీవో శ్రీలత, సర్పంచులు మూగల పరశరాములు, రాచపల్లి సదయ్య, ఎంపీటీసీ రాజయ్య, ఎంపీవో సతీశ్‌కుమార్, ఏపీఎం సత్యప్రకాశ్, పంచాయతీ కార్యదర్శులు రాజేందర్, శ్రీనివాస్‌తో పాటు తదితరులు ఉన్నారు.
మల్యాల, శ్రీరాములపల్లి సందర్శన
మండలంలోని శ్రీరాములపల్లి, మల్యాల గ్రామాలను ఆదివారం అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సందర్శించారు. ఆయా గ్రామాల్లోని వైకుంఠధామాలు, క్రీడామైదానాలు, నర్సరీలను పరిశీలించారు. గతేడాది రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఎండిపోగా, వాటి స్ధానంలో కొత్తవి నాటాలని అధికారులకు చెప్పారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు తిప్పారపు మొగిలి, సాంబయ్య, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, డీఆర్డీవో శ్రీలత, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు కొండల్‌రెడ్డి , రాజేశ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగిన పల్లె, పట్టణ ప్రగతి
పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం కొసాగింది. ఇందులో భాగంగా పట్టణంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో అధికారులు పారిశుధ్య పనులను చేపట్టారు. చెత్తను డంప్‌యార్డుకు తరలించారు. నాగంపేట గ్రామంలో సర్పంచ్ చందుపట్ల స్వాతీకృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ క్రీడా మైదానం కోసం స్థలాన్ని చదును చేయించారు. అలాగే ఆయా గ్రామాల్లో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాదిరెడ్డి వెంకట్‌రెడ్డి, సర్పంచులు కడిపికొండ రాజిరెడ్డి, రాచపల్లి సదయ్య, బల్గూరి పద్మ, కనపర్తి వంశీధర్‌రావు, గిరవేన రమ, బొజ్జం కల్పన, మూగల పరశురాములు, బోయిని రాజ్‌కుమార్, సుంకిశాల పద్మ, పోతరవేని రాజుకుమార్, వజ్జెపల్లి ఆగయ్య, కాత్మండి మహేందర్, ఇల్లందుల అన్నపూర్ణ, పుప్పాల శైలజ, ఆకినపల్లి సుజాత, చిలుముల వసంత, జెక్కన శ్రీలత, గ్రామ ప్రత్యేకాధికారులు పారిశుధ్య పనులు చేపట్టారు. మొక్కలు నాటారు. ఎంపీవో సతీశ్‌కుమార్ పనులను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
సైదాపూర్‌లో..
మండలంలోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను ఎంపీడీవో పద్మావతి పరిశీలించారు. ఆయా గ్రామాల్లో మొకలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొక్కలు నాటడడంతోపాటు వాటిని సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.