గంగాధర, జూన్ 12 : ముఖ్యమంత్రి కేసిఆర్ శ్రీ కారం చుట్టిన పల్లెప్రగతితో గ్రామాలకు మహర్దశ పడుతుందని జడ్పీటీసీ పుల్కం అనురాధ అన్నా రు. మండలంలోని చెర్లపల్లి(ఆర్)లో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పాదయాత్ర నిర్వహించి వీధుల్లో పారిశుధ్యాన్ని పరిశీలించారు. ఆధునిక వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, నర్సరీని పరిశీలించారు. వైకుంఠధామం చుట్టూ బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కార్యదర్శికి సూచించారు. ఇంకుడు గుంతల ఆవశ్యకత, వ్యక్తిగత మ రుగుదొడ్ల వినియోగం, ప్లాస్టిక్ నివారణపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలోని రక్షిత మంచినీటి బావి వద్ద ట్రాన్స్ఫార్మర్ అవసరం ఉందని గ్రామస్తులు కోరగా అధికారులతో మాట్లాడి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తుల భాగస్వామ్యంతో పల్లెప్రగతిని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఊరూరా పండుగలా..
గంగాధర మండలంలోని వివిధ గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమం ఆదివారంఊరూరా పండుగ లా కొనసాగుతున్నది. కార్యక్రమంలో భాగంగా ప్ర జాప్రతినిధులు, అధికారులు గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. వైకుంఠధామాన్ని సందర్శించి చూట్టు బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఎండి పోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటా రు. వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్‌కు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు . ప్రభుత్వ భవనాలు, పాఠశాలల్లో చెత్తను తొలగించి శుభ్రం చేశారు. తరగతి గదులను నీటితో శుభ్రం చేశారు. హరితహారంలో భాగంగా గ్రామ పంచాయతీ పరిధిలో మొక్కలకు నీళ్లు పోశారు. ప్లాస్టిక్ నివారణపై అవగాహన కల్పించడంతో పాటు వినియోగించద్దని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు , వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.