విద్యానగర్, జూన్ 11: కరీంనగర్లో కార్పొరేట్ కంపెనీలు ఏర్పాటు చేయడం శుభపరిణామం అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్‌లోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన డాజిల్ అత్లీస్యూర్ షోరూంను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంతో పోల్చితే కరీంనగర్లో హైదరాబాద్‌కు సమానంగా షోరూంలు విస్తరిస్తున్నాయన్నారు. ప్రజలకు సరసమైన ధరల్లో దుస్తులను అందించాలని సూచించారు. అలాగే, షోరూంలో సినీ నటి శ్రద్ధాదాస్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రోజు డ్యాన్స్, యోగా చేస్తే మానసికోల్లాసం కలుగుతుందన్నారు. షోరూంలో మెన్, ఉమెన్‌కు అతి తక్కువ ధరలో డాజిల్ బ్రాండ్‌లో టీషర్ట్స్, లోయర్, అప్పర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. డాజిల్ సీఎండీ పాలడుగు వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ, క్రీడాకారులకు తక్కువ ధరలో స్పోర్ట్స్ దుస్తులను అందించాలనే ఉద్దేశ్యంతోనే డాజిల్ కంపెనీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. షోరూంలో మెన్, ఉమెన్ దుస్తులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, రవీందర్‌రెడ్డి, రమేశ్, నిర్వాహకులు రితికేశ్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, విజయ్‌కుమార్, యాకుబ్‌రెడ్డి, కరుణాకర్‌రావు, సీఐ లక్ష్మణ్‌బాబు, గ్లాసు శ్రీనివాస్, కార్పొరేటర్లు విజయ, తోట రాములు, తదితరులు పాల్గొన్నారు.