కార్పొరేషన్,జూన్ 11: ప్రజల భాగస్వామ్యంతోనే నగరాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంటాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా శనివారం నగరంలోని వైర్లు లేని విద్యుత్ స్తంభాల తొలగింపు పనులు, బ్యాంక్ కాలనీలో పార్కును మేయర్ వై సునీల్‌రావు, కలెక్టర్ కర్ణన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ భావితరాలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. పట్టణ ప్రగతి ద్వారా నిరుపయోగంగా ఉన్న విద్యుత్ పోళ్ల తొలగింపు, లూస్వైర్ల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. లో ఓల్టేజ్ సమస్యలు తలెత్తకుం డా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అం దించాలని నగరం చుట్టూ 33/11 కేవీ సబ్సేష్టన్లను నిర్మిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ స్థ లాలను పార్కులుగా తీర్చిదిద్దుతున్నామన్నా రు. కార్యక్రమంలో స్థానికసంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, విద్యుత్‌శాఖ ఎస్ఈ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ సేవాఇస్లావత్, కార్పొరేటర్లు భూమాగౌడ్, జంగిలి సాగ ర్, బండారి వేణు, వాల రమణారావు, నాయకులు చల్ల హరిశంకర్, మేచినేని అశోక్‌రావు ఉన్నారు.
బ్యాంకు కాలనీలో 33/11కేవీ సబ్‌స్టేషన్..
బ్యాంకు కాలనీలో 2కోట్లతో నిర్మించిన 33/11కేవీ సబ్‌స్టేషన్ శనివారం అందుబాటులోకి వచ్చింది. మంత్రి గంగుల కమలాకర్ స్విచ్ ఆన్ చేసి సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మెరుగైన కరెంట్ సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏయే ప్రాంతాల్లో సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అడగగా గీతాభవన్, మార్క్‌ఫెడ్ ఏరియా, ఆటోనగర్, తీగలగుట్టపల్లె, శనివారం అంగడి ప్రాంతాల్లో అవసరమని ఎస్ఈ గంగాధర్ మంత్రికి వివరించారు. కొత్త సబ్‌స్టేషన్‌లో ఆరు 11కేవీ ఫీడర్లు అందుబాటులోకి రావడంతో బ్యాంకు కాలనీ, మెహర్‌నగర్, రెడ్డి హాస్టల్ ఏరియా వెనుక భాగం, సీతారాంపూర్‌లో కొంత ప్రాంతం, చైతన్యపురి, కెమిస్ట్ భవన్ ఏరియాకు నాణ్యమైన నిరంతర కరెంట్ సరఫరా జరగనున్నదని మంత్రి చెప్పారు.కార్యక్రమంలో డీఈలు రాజిరెడ్డి, సాంబారెడ్డి, బాలయ్య, ఏడీఈలు నరేందర్, సుధీర్‌కుమార్, శ్రీనివాస్‌రావు, ఏఈలు శ్రీనివాస్‌రావు, జనార్దన్, ఈఎల్పీ రాజు ఉన్నారు.