చొప్పదండి, జూన్ 9: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలానికి చెందిన 16 మందికి సీఎంఆర్ఎఫ్ కింద రూ.6,45,500 ఆర్థిక సాయం మంజూరైంది. కాగా, గంగాధర మండలం బూర్గుపల్లిలోని నివాసంలో లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో నిరుపేదలు దవాఖానలో చికిత్స చేసుకుంటే ఖర్చులపాలై తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం దవాఖానలో చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తూ ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ సురేశ్, నాయకుడు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో ఆర్థిక భరోసా సీఎంఆర్ఎఫ్
గంగాధర, జూన్ 9: అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానలో చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలానికి చెందిన 23 మందికి సీఎంఆర్ఎఫ్ కింద రూ. 8,49,500 ఆర్థిక సాయం మంజూరైంది. కాగా, గురువారం బూరుగుపల్లిలోని నివాసంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, నాయకులు నగేశ్, రమేశ్ పాల్గొన్నారు.