హుజూరాబాద్‌టౌన్, జూన్ 9: పట్టణ ప్రగతిలో వీధుల్లోని చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవాలని హుజూరాబాద్ పురపాలక చైర్పర్సన్ గందె రాధిక పేరొన్నారు. పట్టణ ప్రగతిలో భా గంగా గురువారం పలు వార్డులను చైర్ పర్సన్ సందర్శించారు. వైకుంఠధామంలో అభివృద్ధి, వార్డుల్లో పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. అనంతరం పలువురితో మా ట్లాడి సమస్యలను తెలుసుకుని వాటి పరిషారానికి సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు, ఇన్చార్జి ఇంజినీర్ జీ సాంబరాజు, టౌన్ ప్లానింగ్ అధికారులు జ్యోష్ణా, అశ్వినీగాంధీ, శానిటరీ ఇన్స్పెక్టర్ పీ అనిల్‌కుమార్, హెల్త్ అసిస్టెంట్ కిషన్‌రా వు, వార్డుల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
జమ్మికుంట, జూన్ 9: పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని, అందుకు అన్ని వర్గాల సహకా రం అవసరమని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య అన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో కమిషనర్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి నిర్వహించారు. పరిసరాలు శుభ్రం చేయించారు. హరితహారం మొక్కలకు గార్డులను ఏర్పాటు చేశారు. వాటి చుట్టూ ఉన్న చెత్తా చెదారం, పిచ్చి మొక్కలను సిబ్బంది చేత తొలగించారు. సమస్యాత్మక వార్డులను స్థానిక కౌన్సిలర్లతో కలిసి కలియతిరిగారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్యతా క్రమంలో పనుల ను గుర్తించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని కోరారు. పట్టణ ప్రగతి కార్యక్రమం బాగుందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో అధికారు లు, సిబ్బంది, కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.
గ్రామాభివృద్ధికి సహకరించాలి
ఇల్లందకుంట జూన్ 9: గ్రామాభివృద్ధికి సహకరించాలని టేకుర్తి గ్రామ ప్రత్యేకాధికారి కనుకయ్య కోరారు. గ్రామంలో గురువారం పల్లె ప్రగ తి కార్యక్రమంలో పాల్గొన్నారు. వీధుల్లో సర్పంచ్ వనమాలవాసు ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో పారిశధ్య పనులు చేపట్టారు. ప్రకృతివనాలను సందర్శించి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచులు రాజిరెడ్డి, వెంకటస్వామి, సరోజన, దిలీప్‌రెడ్డి, రఫీఖాన్, అరుణ, రజిత, మొగిళి, పంచాయతీ కార్యదర్శులు సతీశ్, శ్రీనివాస్‌రెడ్డి, కిషన్, సంధ్యారాణి, శ్రీనివాస్, రాజేశ్, స్వప్న, లక్ష్మణ్, అంకూ స్, కిశోర్, కొండాల్‌రెడ్డి, వార్డు సభ్యులు ఉన్నారు.
జోరుగా ప్రగతి పనులు
జమ్మికుంట రూరల్, జూన్9: మండలంలోని పలు గ్రామాల్లో 5వ విడత పల్లె ప్రగతి పనులు గురువారం కొనసాగాయి. ఏడోరోజూ గ్రామాల్లో పారిశుధ్య పనులు నిర్వహించారు. అంతకుముందు ప్రత్యేకాధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బృహత్ పల్లె ప్రకృతి వనాలకు స్థలాల గుర్తింపు పనులను ప్రారంభించారు. ప్రకృతి వనాల్లో మొక్కలు నాటారు. ఖాళీ స్థ లాలు, మురుగు కాలువలు, రోడ్లను శుభ్రం చేశా రు. ఇక్కడ వార్డు సభ్యులు, అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.