వీర్నపల్లి, జూన్ 7: ఇద్దరు రైతుల మధ్య భూ రిజిస్ట్రేషన్‌కు సాక్షి సంతకం పెట్టడానికి వచ్చిన మరో రైతు పాము కాటుకు గురయ్యాడు. వీర్నపల్లి మండల కేంద్రంలో మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వన్‌పల్లికి చెందిన నూనె నర్సింహారెడ్డి, ఉప్పునీటి రాజయ్య భూ రిజిస్ట్రేషన్‌కు మంగళవారం స్లాట్ బుక్ చేసుకుని, అదే గ్రామానికి చెందిన పులకం మోహన్‌ను సాక్షి సంతకం పెట్టడానికి పిలిచారు. రిజిస్ట్రేషన్‌కు సమయం ఉండడంతో కార్యాలయ ఆవరణలో చెట్టు కింద ముగ్గురూ కూర్చున్నారు. ఈ సమయంలో మోహన్‌కు క్షణాల వ్యవధిలో పాము రెండుసార్లు కాటేసింది. బాధిత రైతు కేకలు వేయడంతో అక్కడే ఉన్న తహసీల్ కార్యాలయ సిబ్బంది, స్థానికులు మోహన్‌ను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. బాధితుడిని తహసీల్దార్ తఫాజుల్ హుస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ రవీంద్రచారి పరామర్శించారు.