కార్పొరేషన్, జూన్ 7: నగరంలోని 60 డివిజన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమం మంగళవారం ఐదో రోజు జోరుగా సాగింది. అన్ని డివిజన్లలో మురుగు కాల్వలు, డ్రైనేజీల్లో పూడికను తొలగించారు. ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు చుట్టు పక్కల ఇండ్ల యజమానులకు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయవద్దని అవగాహన కల్పించారు. ఆయా డివిజన్లలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. 3వ డివిజన్లో కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. 9వ డివిజన్లో కార్పొరేటర్ జంగిలి ఐలేందర్‌యాదవ్ ఆధ్వర్యంలో పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ తీశారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బంది తీసుకువచ్చే వాహనంలో వేయాలని కోరారు. 18వ డివిజన్లో కార్పొరేటర్ సుధగోని మాధవీకృష్ణాగౌడ్ పర్యటించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని డివిజన్లలో జరిగిన కార్యక్రమాల్లో కార్పొరేటర్లు, అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, జూన్ 7:పట్టణ ప్రగతి కార్యక్రమంతో సమస్యలు పరిష్కారమవుతాయని మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పేర్కొన్నారు. పట్టణంలోని 12వ వార్డులో ఆయన పర్యటించారు. ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. అలాగే, బడి బాటలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, కౌన్సిలర్లు వేముల కవిత, మానుపాటి వేణుగోపాల్, వాసాల రమేశ్, చింతల సత్యనారాయణరెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ ఫక్రుద్దీన్, ఎస్కే బాబా, ఏఈ ఆసీఫ్, నాయకులు గున్నాల రమేశ్, స్వర్గం నర్సయ్య పాల్గొన్నారు.
గ్రామానికో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలి
గ్రామానికో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని తహసీల్దార్ నల్ల వెంకట్ రెడ్డి, మండల ప్రత్యేకాధికారి మధుసూదన్ అధికారులకు సూచించారు. మండలంలోని దుర్శేడ్ గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా క్రీడా మైదానం ఏర్పాటు కోసం ఇన్చార్జి ఎంపీడీవో సంపత్‌కుమార్‌తో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజిలెన్స్ ప్రత్యేకాధికారి ఐలయ్య, ఆర్ఐలు రజినీకాంత్, భవాని, సర్పంచ్ గాజుల వెంకటమ్మ, ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు, వార్డు సభ్యుడు వెంకటేశ్వర్లు, సింగిల్ విండో డైరెక్టర్ గాజుల అంజయ్య, కారోబార్ మురళి, అంగన్వాడీ టీచర్లు పద్మ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.