తెలంగాణచౌక్, జూన్7: ఆరీస్టీ కరీంనగర్ రీజియన్ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మంగళవారం ఒక్కరోజే కోటి49 లక్షల 80వేలు ఆర్జించింది. సంస్థపై ప్రజల్లో ఆసక్తి పెరగడం, ఇంకా వివాహాది శుభకార్యాలతో రద్దీ ఎక్కువగా ఉండడంతో భారీ ఆదాయం వచ్చింది. రీజియన్ పరిధిలోని 11 డిపోల పరిధిలో ఈ మొత్తం సమకూరగా, యంత్రాంగం సంబురాలు చేసుకున్నది. గోదావరిఖని డిపోలో 22,29,660, హుస్నాబాద్ 5,83,7719, హుజూరాబాద్ 8,19,466, కరీంనగర్ ఒకటో డిపో 2,0,44,673, కరీంనగర్ రెండో డిపో 19,82,860, మంథని 8,68,442, జగిత్యాల 22,04,231, కోరుట్ల 11,28,944, మెట్పల్లి 8,39,533, సిరిసిల్ల 11,24,234, వేములవాడ 11,53,976 డిపోల నుంచి ఆదాయం వచ్చిందని ఆర్ఎం ఖుస్రోషా ఖాన్ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు కృషిచేసిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.