కళ్లెదుట కనిపించే ‘పచ్చని’ దైవం..
తల్లిని మించిన ‘చల్లని’ దైవం..!
ఆహారం.. ఆరోగ్యం
పాలు.. పండ్లు
నీడ.. గూడు
నీరు.. నిప్పు
విద్య.. వైద్యం
ఒకటా& రెండా..
ఎన్నని చెప్పేది..
అన్నింటినీ ఇస్తుంది..
అందరినీ అంటిపెట్టుకుంటుంది..
జననం నుంచి మరణం వరకు..!!
అందుకే..
దానిని పెంచాలి..
దానిని పోషించాలి..!
దైవంలా చూడాలి..
దైవంలా మొక్కాలి..!!
ఆ ‘దైవం’ పేరేమిటో తెలుసా..?
మొక్క…!!!
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, సింగరేణి సంయుక్తాధ్వర్యంలో జిల్లాలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. కొత్తగూడెంలో ర్యాలీని అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కొత్తగూడెం క్లబ్లో జరిగిన సభలో మాట్లాడారు. మొక్కలను నాటడం-సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఈఈ శంకర్, మున్సిపల్ కమిషనర్లు నవీన్‌కుమార్(కొత్తగూడెం), శ్రీకాంత్(పాల్వంచ), తహసీల్దార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ, జూన్ 5: మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కలెక్టర్ అనుదీప్ మొక్క నాటారు.
చుంచుపల్లి, జూన్ 5: చుంచుపల్లి తండాలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆదివారం మొక్క నాటి ప్రారంభించారు. జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, ఎంపీపీ బదావత్ శాంతి, కోఆప్షన్ మెంబర్ ఆరిఫ్ ఖాన్, సర్పంచ్ ధనలక్ష్మి, ఉప సర్పంచ్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
చుంచుపల్లి, జూన్ 5: ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీపీ శాంతి మొక్కలు నాటారు. ఎంపీడీవో రమేష్, ఎంపీవో గుంటి సత్యనారాయణ, కో ఆప్షన్ మెంబర్ ఆరిఫ్ ఖాన్, ఏపీవో రఘుపతి పాల్గొన్నారు.
కొత్తగూడెం లీగల్, జూన్ 5: మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యాన కొత్తగూడెం కోర్టు, పోక్సో కోర్టుల ఆవరణలో జిల్లా అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.దీప మొక్క నాటారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనుబ్రోలు రాంప్రసాద్‌రావు పాల్గొన్నారు.
పాల్వంచ రూరల్, జూన్ 5: కిన్నెరసాని వైల్డ్‌లైఫ్ ఆధ్వర్యంలో పాల్వంచలోని డివిజన్ కార్యాలయంలో రేంజ్ ఆఫీసర్లు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరావు, బ్రహ్మకుమారీస్ సిస్టర్స్ మొక్కలు నాటారు.
కొత్తగూడెం అర్బన్, జూన్ 5: కొత్తగూడెం 24వ వార్డులో మున్సిపల్ కమిషనర్ నవీన్‌కుమార్. కౌన్సిలర్ బాలిశెట్టి సత్యభామ మొక్కలు నాటారు. శానిటరీ ఇన్స్పెక్టర్ వీరభద్రాచారి తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ, జూన్ 5: మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కమిషనర్ శ్రీకాంత్‌తో కలిసి డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు మొక్కలు నాటారు. తైక్వాండో క్రీడాకారిణి సింధూతపస్వి, మున్సిపల్ డీఈ మురళి, ఏఈ రాజేష్ పాల్గొన్నారు.
కొత్తగూడెం అర్బన్, జూన్ 5: కొత్తగూడెం 17వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, కమిషనర్ నవీన్‌కుమార్, తహసీల్దార్ రామకృష్ణ, కౌన్సిలర్ గుమ్మడెల్లి కల్యాణి మొక్కలు నాటారు. 35వ వార్డులో కౌన్సిలర్ బండారి రుక్మాంగధర్, వార్డు స్పెషల్ ఆఫీసర్ శారద తదితరులు మొక్కలు నాటారు.
కొత్తగూడెం టౌన్, జూన్ 5: రామవరం ఎస్సీబీ నగర్లో మొక్కల వెంకటయ్య దంపతులను డీఎస్పీ వెంకటేశ్వరబాబు సన్మానించారు.