అశ్వారావుపేట, జూన్ 5: పర్యావరణ పరిరక్షణను ప్రజలు సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఫారెస్ట్ రేంజర్ అబ్దుల్ రహ్మాన్ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించటం పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు అరుణ్‌కుమార్, సంపత్, సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని తిరుమలకుంట గ్రామం లో ఐదేళ్ల చిన్నారి గుద్దేటి సాహిత్ తన తాతయ్య పుల్లారావుఇంటి ప్రాంగణంలో మొక్క నాటాడు.
దమ్మపేట, జూన్ 5 : దమ్మపేటలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. రేంజర్ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతంలో ఉసిరి, నిమ్మ, నల్లేరు, మారేడు తదితర రకాల మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ములకలపల్లి, జూన్ 5: మొగరాలగుప్ప గ్రామంలో ఐటీసీ బంగారు భవిష్యత్ సహకారంతో సొసైటీ ఫర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. సంస్థ ఏపీవో రంగారావు, సర్పంచ్ కీసరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మి, కమ్యూనిటీ ఆర్గనైజర్ సమ్మయ్య, పంచాయతీ కార్యదర్శి అరుణ్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.