అశ్వారావుపేట, జూన్ 5: పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారిణి, కొత్తగూడెం ఆర్డీవో స్వర్ణలత అధికారులను సూచించారు. మండల కార్యాలయంలో ఆదివారం జరిగిన పల్లె ప్రగతి సమీక్షా సమావేశంలో మాట్లాడారు. పల్లె ప్రగతి తో గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా ఉండడమే కాకుండా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. సమావేశంలో ఎంపీడీవో విద్యాధర్‌రావు, సర్పంచ్‌లు, ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
రహదారులను వనాలుగా మార్చాలి
అశ్వారావుపేట టౌన్, జూన్ 5 :గ్రామ శివారు ప్రాంతాలను సుందరమైన వనాలుగా మార్చాలని ఆర్డీవో స్వర్ణలత అన్నారు. శివారు, అంతర్గత రహదారులకు ఇరువైపులా పూలమొక్కలతో పాటు మొక్కలు నాటాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. ఆదివారం ఐదో విడత పల్లె ప్రగతిలో భాగంగా అశ్వారావుపేట మేజర్ పంచాయతీ, పేరాయగూడెం, మండలంలోని పలు పంచాయతీల్లో పనులను పరిశీలించారు. పట్టణంలో వాటర్ ట్యాంక్‌ల పరిశుభ్రత, కాలువల పూడిక తీత పనులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ అట్టం రమ్య, ఈవో గజవెల్లి హరికృష్ణ పలువురు సర్పంచ్‌లు, కార్యదర్శులు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.