టేకులపల్లి, జూన్ 5: మండలంలోని దాస్‌తండాలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ సీడీపీ నిధుల నుంచి మంజూరైన రూ.14లక్షలతో నూతన గ్రంథాలయ భవనానికి ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, ఏఎంసీ చైర్మన్ హరిసింగ్‌నాయక్ శంకుస్థాపన చేశారు. గ్రంథాలయ భవన నిర్మాణానికి 2 కుంటల భూమిని విరాళంగా ఇచ్చిన భూక్యా మన్నా, రూ.లక్ష విరాళం ప్రకటించిన లక్కినేని సురేందర్‌ను అభినందించారు. మండలంలోని దాస్తండా పంచాయతీ లచ్యాతండా, సింగ్యాతండాల్లో ఎల్టీ-ఎస్టీ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో తాత్కాలిక గ్రంథాలయాన్ని పాఠశాల భవనంలో ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ ప్రియాంక, డీఈ రామకృష్ణ, టీఎస్ టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్, ఉద్యోగ సంక్షేమ సంఘ నాయకులు బోడ గన్నా, నరేందర్, నాగేశ్వరరావు, భూక్యా రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్ గౌడ్, బానోత్ రామ, సీఐ కాశీరాం, లచ్యాతండా, సింగ్యతండా ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.