వేంసూరు, జూన్ 5: ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండల పరిధిలోని రామన్నపాలెంలో ఆదివారం నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో స్వయంగా పార పట్టి కాలువల్లో మురుగు తీశారు. అనంతరం మాట్లాడుతూ.. పల్లెప్రగతితో గ్రామాల్లో ఆశించిన ఫలితాలు వస్తున్నాయన్నారు. పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన పెరిగిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎం కేసీఆర్ ఆశయాల మేరకు పనిచేయాలన్నారు. అనంతరం గ్రామంలో చర్చిని సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. చర్చి నిర్మాణానికి 2500 అడుగుల గ్రానైట్ రాయిని విరాళంగా అందజేస్తానని నిర్వాహకులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ సుమలత, వైస్ ఎంపీపీ దొడ్డా శ్రీలక్ష్మి, సొసైటీ అధ్యక్షుడు కాటే జమలారావు, సర్పంచ్ షేక్ నాగుల్‌మీరా, టీఆర్ఎస్ మండల కార్యదర్శి కంటె వెంకటేశ్వరరావు, నాయకులు రావూరి శ్రీను, గాదె శ్రీనివాసరావు, దొడ్డా చెన్నకేశవ రెడ్డి, గడిపర్తి సత్యనారాయణ, పోట్రు ప్రసాద్, గడిపర్తి రాంబాబు, గడిపర్తి నర్సింహారావు, గుండాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
‘ప్రగతి’ బాటలో పల్లెలు..
సత్తుపల్లి రూరల్, జూన్ 5: పల్లెలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని గంగారం క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి మాట్లాడారు. పల్లె ప్రగతితో ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు అందుబాటులోకి వచ్చాయన్నారు. గతంలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గ్రామస్తులు రోగాల బారిన పడేవారన్నారు. పల్లె ప్రగతితో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా రూపాంతరం చెందుతున్నదన్నారు. ప్రభుత్వం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలుగా ఆస్పత్రిగా మారుస్తున్నదన్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కానున్నాయన్నారు. రూ.1.70 కోట్లతో గ్రామంలోని రహదారి మరమ్మతులు చేపడతామన్నారు.
ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. గంగారం అభివృద్ధికి ఇప్పటివరకు రూ.2.30 కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు. ఈ నిధులతో గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్‌యార్డుతోపాటు ఇతర పనులను పూర్తి చేయించామన్నారు. కార్యక్రమంలో స్పెషలాఫీసర్లు ధనరాజ్, సురేశ్, ఎంపీపీ దొడ్డా హైమావతి, సర్పంచ్‌లు మందపాటి శ్రీనివాసరెడ్డి, దుగ్గిరాల వాణి, పాకలపాటి శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, వైస్ ఎంపీపీ దాసరి వెంకట్రామిరెడ్డి(చిట్టినాయన), జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, నాయకులు కంచర్ల నాగేశ్వరరావు, మాదిరాజు వాసుదేవరావు పాల్గొన్నారు.