అన్నపురెడ్డిపల్లి, జూన్ 5: గ్రామాల్లో ‘పల్లె ప్రగతి’ని పండుగలా నిర్వహించాలని కార్యక్రమ రాష్ట్ర పరిశీలకుడు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ జాయింట్ కమిషనర్ జగత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మండల పరిధిలోని అబ్బుగూడెంలో పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్‌యార్డ్, డంపింగ్ యార్డులను పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. డంపింగ్‌యార్డ్‌కు తడి, పొడి చెత్తను వేరువేరుగా తరలించాలన్నారు. డంపింగ్‌యార్డ్‌లో తయారు చేసిన కంపోస్టు ఎరువులను హరితహారం మొక్కలకు వేయాలని సూచించారు. నర్సరీలో మొక్కల పెంపకంపై జాగ్రత్త వహించాలన్నారు. ఇంటింటా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. పక్కాగా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్నారు. పర్యటనలో ఎంపీడీవో రేవతి, డీఆర్డీవో మధుసూదనరాజు, డీపీవో లక్ష్మీ రమాకాంత్, పంచాయతీ కార్యదర్శి శాంతి పాల్గొన్నారు.
చండ్రుగొండ మండలంలో..
చండ్రుగొండ, జూన్ 5: పల్లె ప్రగతి రాష్ట్ర పరిశీలకుడు జగత్‌కుమార్‌రెడ్డి ఆదివారం మండలంలోని తిప్పనపల్లి పంచాయతీలో పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. డంపింగ్‌యార్డుల ద్వా రా పాలకవర్గాలు అదనపు ఆదాయాన్ని పొందవచ్చన్నారు. వైకుంఠ ధామాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి సంజీవరావు, ఎంపీడీవో అన్నపూర్ణ, ఎంపీవో తోట తులసీరాం, సర్పంచ్ ధరావత్ పార్వతి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఉపసర్పంచ్ రామారావు ఉన్నారు.