సమైక్య పాలనలో తెలంగాణపై అడుగడుగునా వివక్ష కొనసాగింది. కానీ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించి అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నరు. రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నరు. రాష్ట్రం రాకముందు.. వచ్చిన తర్వాత ఇక్కడి గ్రామాల పరిస్థితి ఎలా ఉందో ప్రజలు గమనించాలి. ఈ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో ఉన్నయా..? కనీసం మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనైనా అమలవుతున్నయా..? అని తెలుసుకోవాలి. గడిచిన ఎనిమిదేండ్లలోనే తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది. దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఇదంతా సీఎం కేసీఆర్ కృషితోనే సాధ్యమైంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో పరితపిస్తున్నారు. ఎన్నో పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలో అమలవుతున్నా యా..? ప్రధానిగా ఉన్న మోదీ సొంత రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు లేవు. గడిచిన ఎనిమిదేండ్లలోనే తెలంగాణ అన్నిరంగాల్లో ప్రగ తి సాధించింది. తెలంగాణకు ముందు, రాష్ట్రం వచ్చిన తర్వాత మ ల్కాపూర్లో అభివృద్ధి ఎలాఉందో ప్రజలు గమనించాలి. గ్రామాల్లో అన్ని మౌలిక వసతులను కల్పించాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాల్లో క్రీడాకారులను ప్రో త్సహించేందుకు క్రీడా మైదానాలను నిర్మిస్తున్నారు. అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మనమే కాపాడుకోవాలి. సీఎం కేసీఆర్‌తో మనకు బంగారు భవిష్యత్తు ఉంటుంది.
– మల్కాపూర్, లింగాపూర్‌లో మంత్రి గంగుల కమలాకర్
నియోజకవర్గంలో 80శాతం మహిళా సంఘ భవనాలు : ఎమ్మెల్యే రసమయి
లింగాపూర్ సభలో మొదటగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రాష్ట్ర పథకాలపై పాట పాడి ప్రజలకు అవగాహన క ల్పించారు. నాడు దుబాయ్ ఇతర దేశాలకు వలస వెళ్లే పరిస్థితులుండేవని, ఇప్పుడు ఇక్కడే ఉండి పనులు చేసుకుంటున్నామని వివరించారు. నీళ్లు, పచ్చని చెట్లతో తెలంగాణ అంతా హరితవనంగా మారిందని గుర్తు చేశారు. అనంత రం మాట్లాడారు. అన్ని నియోజక వర్గాల్లో కంటే మానకొండూర్ నియోజక వర్గంలోనే 80 శాతం మహిళా సంఘాల భవనాలు నిర్మించామని చెప్పారు. అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని కుల సంఘాల భవన నిర్మాణాలకు నిధులను అందించిన ఘనత ఈ తెలంగాణ ప్రభుత్వానిదేనని ప్రశంసించారు. ఆ తర్వాత మానకొండూర్ నియోజకవర్గంలో అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని వినతులను అందించారు.