కరీంనగర్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : నగరంలోని 22వ డివిజన్ పరిధిలో గల సుభాష్‌నగర్‌లో పట్టణ ప్రగతిని, కరీంనగర్ మండలంలోని చామనపల్లిలో పల్లె ప్రగతిని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై సునీల్‌రావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌తో కలిసి ప్రారంభించారు. చామనపల్లిలో క్రీడా మైదానాన్ని ప్రారంభించి, కాసేపు వాలీబాల్ ఆడారు. జూబ్లీనగర్లోనూ క్రీడా మైదానాన్ని, పల్లె ప్రగతిని మంత్రి ప్రారంభించారు. చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పట్టణ ప్రగతిని ప్రారంభించి, తెలంగాణ చౌక్ నుంచి మార్కెట్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పల్లె ప్రగతిని ప్రారంభించారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తిలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ ప్రారంభించారు. వీణవంక మండలంలోని ఘన్ముక్ల, బొంతుపల్లి, ఎలుబాక, గంగారం గ్రామాల్లో పల్లెప్రగతిని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. హుజూరాబాద్ పట్టణంలోని 16, 27 29 వార్డుల్లో జరిగిన పట్టణ ప్రగతిలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, కొత్తపల్లిలో వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న కోటి, కమిషనర్ సమ్మయ్య ప్రారంభించి, వార్డుల్లో ర్యాలీ తీయగా, ప్రత్యేకాధికారి రమేశ్‌బాబు హాజరయ్యారు.
నేడు జిల్లాకు మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కొత్తపల్లి మండలం మల్కాపూర్‌లో జరిగే పల్లె ప్రగతిలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మానకొండూర్ మండలం లింగాపూర్‌లో జరిగే పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరుకానున్నారు.