కార్పొరేషన్, జూన్ 3: నగరంలో ఐదో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. 22వ డివిజన్లో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. అలాగే, 33వ డివిజన్లో మేయర్ వై సునీల్‌రావు వార్డు కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. పట్టణ ప్రగతిలో భాగంగా డివిజన్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. 33వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. నగరంలో పారిశుధ్యం మెరుగుపరిచి, పచ్చదనం పెంచుతామన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి నెలా విడుదల చేస్తున్న పట్టణ ప్రగతి నిధులు రూ.2.50 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. అధునాతన మరుగుదొడ్ల నిర్మాణం, పారులు, 10 చోట్ల వాకింగ్ ట్రాక్‌లు, 30 ఓపెన్ జిమ్‌లు, 11 చోట్ల నర్సరీలను ఏర్పాటు చేసి పట్టణ ప్రకృతి వనాలను కూడా పెంచినట్లు తెలిపారు. నగర వ్యాప్తంగా 180 క్రీడా మైదానాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఎస్ఈ నాగమల్లేశ్వర్, ఈఈ మహేందర్, వార్డు ప్రత్యేకాధికారి, వార్డు కమిటీ సభ్యులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. 37వ డివిజన్లోని మీ సేవ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్ అధ్యక్షతన డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెప్మా పీడీ రవీందర్, ప్రత్యేకాధికారి రాజకుమార్, డివిజన్ ఆఫీసర్ సంజీవ్, సీవో సునీత, డివిజన్ కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. 18వ డివిజన్లో కార్పొరేటర్ సుధగోని మాధవీకృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించారు. డివిజన్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. మురుగు కాలువలు, రోడ్లను దశల వారీగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి వెంకటరమణ, కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. 53 డివిజన్లో కార్పొరేటర్ శ్రీదేవి-చంద్రమౌళి అధ్యక్షతన డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించి, సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి సంజీవరెడ్డి, నోడల్ ఆఫీసర్ రాజు, కమిటీ సభ్యులు కనకయ్య, సీహెచ్ శంకర్, ఎల్లయ్య, మాలిక్, ఇబ్రహీం, అజయ్, అనిత, భారతి, యశోద, సంజన పాల్గొన్నారు. 42వ డివిజన్లో జరిగిన వార్డు కమిటీ సమావేశంలో కార్పొరేటర్ మేచినేని వనజ-అశోక్‌రావు, డివిజన్ ప్రజలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అలాగే, 35వ డివిజన్లో కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి అధ్యక్షతన డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించి డివిజన్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మహేశ్వరరెడ్డి, కమిటీ సభ్యులు పాపిరెడ్డి, దాదారెడ్డి, రాజిరెడ్డి, కోటేశ్‌కుమార్, శ్రీధర్ స్వామి, రామయ్య, హనుమంతరావు, గోపాలరెడ్డి, రమేశ్, తిరుపతిగౌడ్, గౌస్ పాషా, హరికృష తదితరులు పాల్గొన్నారు. 59వ డివిజన్ కార్యాలయంలో కార్పొరేటర్ గందె మాధవి అధ్యక్షతన డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించి డివిజన్లో సమస్యలను గుర్తించారు. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీఈ రవీందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకన్న, జవాన్ వెంకటేశ్, డివిజన్ కమిటీ సభ్యులు శ్రీనివాస్, విజయ్, శేఖర్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. 8వ డివిజన్లో కార్పొరేటర్ సల్ల శారదారవీందర్ అధ్యక్షతన డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించారు. డివిజన్లో నెలకొన్న సమస్యలపై అధికారులతో చర్చించారు. సమావేశంలో ఆశ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.