కొత్తపల్లి, మే 30: పట్టణంలో జూన్ 3వ తేదీ నుంచి నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పాలకవర్గ సభ్యులంతా కలిసి విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం చైర్మన్ రుద్ర రాజు అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారిశుధ్య పనులు, మంచినీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, కౌన్సిలర్లు వాసాల రమేశ్, జెర్రిపోతుల మొండయ్య, జెర్రిపోతుల అంజలి, మానుపాటి వేణుగోపాల్, గున్నాల విజయ, ఎస్కే నజీయ, చింతల సత్యనారాయణరెడ్డి, వేముల కవిత, కో-ఆప్షన్ సభ్యులు ఎండీ ఫక్రొద్దీన్, శెట్టిపల్లి ప్రభాకర్, ఎస్కే షహనాజ్, కట్ల మమత, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.