కరీంనగర్ రూరల్, మే 10: గత వర్షాకాలం దెబ్బతిన్న బీటీ రోడ్లకు వేగంగా మరమ్మతు చేయిస్తామని, ప్రయాణికులకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి, కరీంనగర్ మండలం నగునూర్ గ్రామంలోని జూబ్లినగర్ క్రాసింగ్ వద్ద ప్యాచ్‌వర్క్ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బీటీ రోడ్ల మరమ్మతు పనులకు రూ.2.30 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వీటితో తీగలగుట్టపల్లి, నగునూర్ నుంచి రుక్మాపూర్ వరకు రోడ్డు మరమ్మతు పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఆర్అండ్బీ బీటీ రోడ్డును చొప్పదండి వరకు మరమ్మతు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న అన్ని రోడ్లకు త్వరలోనే మరమ్మతులు పూర్తి చేయిస్తామని చెప్పారు. ఆయా పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కరీంనగర్, దుర్శేడ్ సింగిల్ విండోల చైర్మన్లు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, బల్మూరి ఆనందరావు, కార్పొరేటర్లు కాశెట్టి లావణ్య, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ కాశెట్టి శ్రీనివాస్, తుల బాలయ్య, సుంకిశాల సంపత్‌రావు, కాశెట్టి దామోదర్, రాజయ్య, దాసరి సాగర్, నగునూర్ సర్పంచ్ ఉప్పు శ్రీధర్, ఎంపీటీసీలు సాయిల వినయ్‌సాగర్, అంకమల్ల శ్రీనివాస్, తిరుపతిగౌడ్, రుద్ర రాములు, మునిరెడ్డి, దుర్ర భారతి, కస్తూరి రాంరెడ్డి, మంద రాజమల్లు, సాయిల శివయ్య, నర్సయ్య, ఆర్అండ్బీ ఎస్ఈ, ఏఈ, డీఈలు, రోడ్డు కాంట్రాక్టర్లు, గ్రామ నాయకులు ప్రభాకర్, శ్రీనివాస్, నెక్పాషా, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.