కొడిమ్యాల, మే 10 : పల్లె ప్రగతితోనే రాష్ర్టానికి అవార్డులు వచ్చినట్లు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల పరిషత్‌కు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తీ కరణ్ జాతీయ ఆవార్డు వచ్చిన సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మేన్నేని స్వర్ణలతకు మంగళవారం నిర్వహించిన సన్మాన సభకు మంత్రి హాజరై మాట్లాడారు. రాష్టాన్ని అన్ని రంగాలలో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఈక్రమంలో డం పింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్, రైతు వేదికలు, మంకీఫుడ్ కోర్టులు, పారిశుధ్య పనులు వంద శాతం మండలంలోని అన్ని గ్రా మాల్లో పూర్తి చేయడం ద్వారా ఈ అవార్డు వచ్చినట్లు మంత్రి వెల్లడించారు.
దేశంలో ఎక్కడ పల్లె ప్రగతి కార్యక్రమం లేదని, దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు పచ్చి అబద్ధాలు మాట్లాడి పబ్బం గడుపుతున్నారని, రాష్ట అభివృద్ధికి ఒక్క రూపా యి కూడా తీసుకురాని ఎంపీలు మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. దేశంలో 18 రాష్టాల్లో ఉన్న బీజేపీ ప్రజల కోసం ఒక్క సంక్షేమ పథకాన్నైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు. దేశ ప్రధాని ఉన్న రాష్ట్రంలో కూడా 2 వేల ఫించన్ ఇస్తలేరన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌కు సిగ్గుండాలన్నారు. ఇటీవలే నల్లగొండ సభలో ధరణిని రద్దు చేస్తామని మాట్లాడడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు ధరణి ద్వారా కోటీ70లక్షల ఎకరాల భూములకు కోటి60లక్షల పాస్ బుక్కు లు ఇచ్చినట్లు చెప్పారు. రైతు అత్మహత్యలకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అంతకు ముందు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పల్లె ప్రగతితో ప్రతి పల్లె సస్యశ్యామలంగా మారుతున్నదన్నారు.
బండి సంజయ్, ధర్మపురి అరవింద్ రాష్ట్ర అభివృద్ధికి ఒక్క పైసా తీసుకురాలేదన్నారు. మాజీ ఎంపీ వినోద్ కృషితో కరీంనగర్ స్మార్ట్ సిటీ ఏర్పాటైందన్నారు. ఎన్నికల హామీలో భాగంగా పసుబోర్డు తీసుకొస్తానన్న అరవింద్ మాటతప్పారన్నారు. దళితబందు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అంతకు ముందు పూడూర్ గ్రామం నుంచి కొడిమ్యాల బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమా ల వేశారు. అవార్డు వచ్చిన సందర్భంగా ఎంపీపీ స్వర్ణలత, రాజనర్సింగరావును సన్మానించి అవా ర్డు ప్రదానం చేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమణ, జిల్లా కలెక్టర్ రవి, జడ్పీ చైర్మెన్ దావ వసంత, గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, డీఆర్డీఏ వినోద్‌కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ సుందర వరదరాజన్, జడ్పీటీసీ సభ్యులు ప్రశాం తి, కొండపల్కుల రాంమ్మెహన్, ఎంపీడీవో పద్మ జ, తహసీల్దార్ స్వర్ణ, సింగిల్ విండో చైర్మన్లు రాజనర్సింగరావు, పోలు రాజేందర్, రవీందర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు పులి వేంకటేశంగౌడ్, జనగాం శ్రీనివాస్, కత్తెరపాక కొండయ్య, వైస్ ఎంపీపీ ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు మల్లారెడ్డి, మహేశ్, సింధు, మిరియా, కో అప్షన్ సభ్యులు నసీరుద్దీన్, సర్పంచులు తిరుపతి, మల్లేశం, బొజ్జానాయక్, నర్సయ్య, కవిత, విజయలక్ష్మి, లత, అనిత, ఎల్లవ్వ, స్వామిరెడ్డి, నాయకులు లక్ష్మిరెడ్డి, శరత్, మహేశ్ పాల్గొన్నారు.