హుజూరాబాద్, ఆగస్టు 22: అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో ఆదివారం మంత్రి హరీశ్‌రావుతోపాటు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీలు ఇరుమల్ల రాణి, సరిగొమ్ముల పావని, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు కేసీరెడ్డి లావణ్య, కళ్లెపెల్లి రమాదేవి, సింగాపూర్ సర్పంచ్ మంద మంజుల, తదితరులు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించారు.
వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు
సింగాపూర్‌లోని వేంకటేశ్వర స్వామిని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.
వీణవంక, ఆగస్టు 22: హుజూరాబాద్‌లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.