చొప్పదండి, మే 4: అన్నదాతలు అధైర్యపడొద్దని, ప్రతి ధాన్యపు గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. చొప్పదండి పట్టణంలో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు రైతులకు అండగా ఉంటున్నదని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని స్పష్టం చేశారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు.
ప్రజల దాహం తీర్చడం అభినందనీయం
వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు చొప్పదండి సహకార సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి కొనియాడారు. పట్టణంలోని ప్రాథమిక సహకార సంఘం ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్ పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, సింగిల్‌విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ గుడిపాటి వెంకటరమణారెడ్డి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, సింగిల్‌విండో వైస్ చైర్మన్ ఎం మహేశ్ గౌడ్, డైరెక్టర్లు గుర్రం ఆనందరెడ్డి, కళ్లెం లక్ష్మారెడ్డి, కొమురయ్య, కార్యదర్శి కళ్లెం తిరుపతిరెడ్డి, నాయకులు గుర్రం హన్మంతరెడ్డి, మహేశ్, ప్రవీణ్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.