చొప్పదండి, మే 3: నేత కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి మండలంలోని నేతన్నలు పాలాభిషేకం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు చేనేత కార్మికులను పట్టించుకోకపోవడంతో రోజుకో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని ఆరోపించారు. స్వరాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. బతుకమ్మ చీరెల తయారీ బాధ్యతను చేనేత కార్మికులకు అప్పగించి, ఉపాధి కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు.
చేనేత కార్మికులు బీమా చేయించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం చేనేత కార్మికులు స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, సింగిల్‌విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు పాషా, నాయకులు నలుమాచు రామకృష్ణ, మాచర్ల వినయ్‌కుమార్, మహేశుని మల్లేశం, దండె కృష్ణ, కొత్తూరి నరేశ్, ఎలిగేటి తిరుపతి, మచ్చ రమేశ్, మావురం మహేశ్, చేనేత కార్మిక సంఘం నాయకులు ఎన్నం మునీందర్, ఎలిగేటి కృష్ణహరి, నరేశ్, శంకర్, మురళి, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, మే 3: తెలంగాణ సర్కారు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి చేనేత కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని సర్పంచ్ అలువాల నాగలక్ష్మి పేర్కొన్నారు. నేతన్న బీమా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని గర్శకుర్తిలో సర్పంచ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, నేతన్న బీమా పథకంతో చేనేతకు భరోసా కల్పించిన సీఎం కేసీఆర్‌కు రుణ పడి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ తడిగొప్పుల రజిత, నాయకులు అలువాల తిరుపతి, తడిగొప్పుల రమేశ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు దూస అనిల్, వార్డు సభ్యులు, మరమగ్గాల కార్మికుల సంఘం నాయకులు, కార్మికులు, వస్త్ర వ్యాపార సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.