రామడుగు, మే 3: రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డల పెండ్లి రూ. లక్షా నూటపదహార్లు అందజేస్తూ అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో 11 మంది, దత్తోజీపేటలో 8 మంది లబ్ధిదారులకు మంగళవారం ఆయన ఇంటింటికీ వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ఆడబిడ్డలుగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే తక్కువ దృష్టితో చూసేవారని, నేడు ఆడబిడ్డ పుట్టిందంటే ఇంటికి లక్ష్మీకళ వచ్చినట్టుగా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆడబిడ్డల పెండ్లికి లక్షా నూటపదహార్లు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నదని తెలిపారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మనమంతా రుణపడి ఉన్నామన్నారు. సర్పంచులు పంజాల ప్రమీల, బండ అజయ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ పండ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, పంజాల జగన్మోహన్గౌడ్, మామిడి తిరుపతి, సైండ్ల కరుణాకర్, పూడూరి మల్లేశం, గోపాల్‌రెడ్డి, రవీందర్, పెంటి శంకర్, మాదం రమేశ్, చాడ ప్రభాకర్‌రెడ్డి, ఎడవెల్లి మల్లేశం, రాజమౌళి పాల్గొన్నారు.