ఇల్లందకుంట మే 2: టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వమని జడ్పీచైర్ పర్సన్ కనుమల్ల విజయ పేర్కొన్నారు. మండలంలోని సీతంపేట్ గ్రామంలో ఇల్లందకుంట పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జడ్పీ చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేస్తున్న ఘనత సీఎందేనని వివరించారు. సహకార సంఘం పరిధిలో 16 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటస్వామి, ఎంపీపీ పావని, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, సహకార సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు.
జమ్మికుంట మండలం విలాసాగర్లో..
జమ్మికుంట రూరల్, మే 2: మండలంలోని విలాసాగర్ గ్రామంలో ఇల్లందకుంట పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ ప్రారంభించారు. జడ్పీటీసీ శ్రీరాంశ్యాం, కేడీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, ఇల్లందకుంట పీఏసీఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, సర్పంచ్ రమాదేవి, సీఈవో ఆదిత్యరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
మానకొండూర్ మండలం జగ్గయ్యపల్లిలో..
మానకొండూర్ రూరల్, మే 2: జగ్గయ్యపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ప్రారంభించారు. జడ్పీటీసీ శేఖర్‌గౌడ్, సర్పంచ్ మల్లం దీప, ఉప సర్పంచ్ సంపత్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు ధర్మేందర్, ఐకేపీ సిబ్బంది, రైతులు, మహిళా సంఘ సభ్యులున్నారు.