కార్పొరేషన్, మే 1: కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మోటార్ వెహికల్ చట్టం జీవో 714తో ఆటో డ్రైవర్ల బతుకులు దీనంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లోని బస్టాండ్ వద్ద కరీంనగర్ జిల్లా ఆటో కార్మిక సంక్షేమ సంఘం, మంచిర్యాల చౌరస్తాలో మినీ ఆటో గూడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఎర్ర జెండాను ఎగురవేశారు. కేక్ కట్ చేసి కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఆటోనగర్‌లో తెలంగాణ ఇంజినీరింగ్, బోరింగ్ జనరల్ వర్‌షాప్ ఓనర్స్ వరర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జెండా ఎగురవేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆటో కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న జీవో 714 రద్దయ్యేదాకా తెలంగాణ ప్రభుత్వం వారి పక్షాన పోరాడుతుందన్నారు. కేంద్రం పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యులపై మోయలేని భారం వేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచి పేదలకు పంచితే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదల కడుపు కొట్టి పెద్దలకు పె ట్టేలా మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం బడుగుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం కార్మికుల కడుపులు కొట్టి అదానీ, అంబానీలకు కొమ్ము కాస్తుందని దుయ్యబట్టారు. కేంద్రం పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కార్మికులకు ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నదన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల నుంచి ఎంతోమంది కార్మికులు ఉపాధి లేక తెలంగాణ రాష్ట్రానికి వలస వస్తున్నారని, వారిని టీఆర్ఎస్ ప్రభుత్వం అకున చేర్చుకొని అండగా నిలుస్తున్నదన్నారు. కార్మికుల సంక్షేమా నికి సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ఆ దుకుంటున్నారని తెలిపారు. వివిధ రంగాల్లోని పేద కార్మికులకు నగరంలో డబుల్ బెడ్రూం పథకాన్ని వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దళిత కార్మికులకు దళితబంధును ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. ఆటోనగర్‌లో కార్మికులకు తాగునీటి సౌకర్యం, సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం, రోడ్డు, డ్రైనేజీ పనులు చేపడుతామని చెప్పారు. నగర మేయర్ వై.సునీల్‌రావు, కార్పొరేటర్ ఐలేందర్‌యాదవ్, టీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, మేచినేని అశోక్‌రావు, అర్ష మల్లేశం, ఎడ్ల అశోక్, ట్రాలీ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణయాదవ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.