తిమ్మాపూర్ రూరల్, మే 1: ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. తొలిపొద్దు కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరానగర్‌లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మే డే వేడుకల్లో పాల్గొని ఎర్ర జెండాను ఆవిష్కరించారు. రామకృష్ణా కాలనీ, ఇందిరానగర్, నుస్తులాపూర్, నల్లగొండ, బాలయ్యపల్లె, మక్తపల్లె, పర్లపెల్లి, మొగిలిపాలం, పోలంపల్లి, నర్సింగాపూర్, మల్లాపూర్, మన్నెంపల్లి, నర్సింగాపూర్, మల్లాపూర్, పొరండ్ల గ్రామాల్లో లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు ఆడ బిడ్డలకు చీర, సారె అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డల పెండ్లికి రూ. లక్షా నూటపదహార్లు అందజేసి ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ ఎలుక అనిత, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, మండల ఉపాధ్యక్షుడు సంపత్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
మానకొండూర్ మండలంలో..
మండలంలోని చెంజర్ల, గంగిపల్లి, కొండపల్కల గ్రామాల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పర్యటించారు. లబ్ధిదారుల ఇండ్లకు స్వయంగా వెళ్లి కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ, అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన పేదలకు తెలంగాణ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం చేస్తూ అండగా ఉంటున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచులు నల్ల వంశీధర్ రెడ్డి, మాశం శాలిని-సాగర్, బొల్ల వేణు, ఎంపీటీసీ గడ్డి రేణుక-గణేశ్, జడ్పీటీసీ శేఖర్‌గౌడ్, ఉపసర్పంచ్ తోట రాజమౌళి, ఆర్బీఎస్ గ్రామ కో-ఆర్డినేటర్ కడారి ప్రభాకర్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్, ఇడుమాల సంపత్, గౌడ్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ తిరుపతి గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షురాలు బొంగోని రేణుక, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బండి సంపత్, మానకొండూర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ పంజాల శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ బైక రాజమౌళి, నాయకులు నరహరి గణపతి రెడ్డి, బండి పెద్ద చంద్రయ్య, కొలిపాక రాయమల్లు, పరశురాములు, రెడ్డి సంపత్ రెడ్డి, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, మూల కరుణాకర్ గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్లు వాల అంజుత్ రావు, బండి రామక్క, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.