ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని హుజూరాబాద్ డివిజన్ వ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. అన్ని కార్మిక సంఘాల నాయకులు ఊరూరా అరుణ పతాకాన్ని ఎగురవేశారు. శ్రమ శక్తిని కొనియాడారు. ప్రజాప్రతినిధులు, నేతలు వేడుకలకు హాజరై కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు.
హుజూరాబాద్ టౌన్, మే 1: హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (టీఆర్ఎస్కేవీ అనుబంధ సంఘం) ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అధ్యక్షుడు గాజుల సంపత్ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, సంఘం ఉపాధ్యక్షులు మొలుగు శ్రీధర్, ఈరెల్లి రమేశ్, నాయకులు కొంగ తిరుపతి, ఎర్ర సమ్మయ్య, రొంటాల స్వరూప, ముక్క రమ తదితరులు పాల్గొన్నారు. రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ (సీఐటీయూ)ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆ యూనియన్ హుజూరాబాద్ మండలాధ్యక్షుడు ప్రతాప శ్రీనివాస్ పతాకాన్ని ఎగురవేశారు.
కార్యక్రమంలో రైస్ మిల్ ఆపరేటర్ల యూనియన్ నాయకుడు తిరగమల్ల అర్జున్, నాయకులు కుమారస్వామి, రవి, సంపత్, మొగిలి, మేక శ్రీనివాస్, మహేందర్, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్, నాయకుడు అశోక్, హమాలీ యూనియన్ నాయకులు రఘుపతి, శ్రీధర్, సారయ్య, శంకర్, చేరాలు, సంపత్ కార్మికులు పాల్గొన్నారు. హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో ఔట్ సోర్సింగ్ కార్మికులు మే డే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం జోన్ కార్యదర్శి వెల్మారెడ్డి రాజిరెడ్డి, నాయకులు ఎర్ర తిరుమల, రాజయ్య, సారయ్య, అనిత, సుమలత, శోభ సిబ్బంది పాల్గొన్నారు. అఖిల భారత పోస్టల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హుజూరాబాద్ ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో జరిగిన వేడుకల్లో ఏఐపీఈయూ-జీఆర్-సీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్, బ్రాంచ్ అధ్యక్షుడు ఇల్లందుల సమ్మయ్య, పీ4 బ్రాంచ్ కార్యదర్శి బానోత్ తిరుపతినాయక్, నాయకులు చందనాల గోపీకిషన్, మీస తిరుమలేశ్, ఎం సంపత్, ఏ సత్యం, ఎం స్వామి, పీ యాదగిరి, రాము, ఇల్లందుల దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ ఆర్టీసీ డిపో క్రాస్ వద్ద మార్బుల్ హమాలీ యూనియన్ జెండాను సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ ఆవిషరించారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు సీఐటీయూ అధ్యక్షురాలు రొంటాల భాగ్య హాజరై జెండాను ఎగురవేశారు. బజార్ హమాలీ యూనియన్ జెండాను తాళ్లపల్లి శ్రీనివాస్ ఆవిషరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి సూపర్ బజార్ మీదుగా అంబేదర్ కూడలి వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ ఎండీ అజ్జు, ఉపాధ్యక్షుడు తుమ్మల కుమారస్వామి, నాయకులు రాచపల్లి లింగయ్య, వెంకట చంద్రయ్య, శంకర్, కడారి రాజయ్య, ఐలయ్య, జెల్లా రాజేశ్, చేరాలు తదితర యూనియన్ల కార్మికులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ మండలంలో..
మండలంలోని తుమ్మనపల్లి, శాలపల్లి-ఇందిరానగర్ తదితర గ్రామాల్లో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తుమ్మనపల్లిలో హమాలీ సంఘం అధ్యక్షుడు పోచయ్య జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
సైదాపూర్ మండలంలో..
లస్మన్నపల్లిలో జరిగిన మేడే వేడుకల్లో ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకునూర్లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బత్తుల బాబు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. మండలకేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో జరిగిన మేడే వేడుకల్లో నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
వీణవంక మండలంలో..
మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో మే డే వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. వల్భాపూర్ గ్రామంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్‌రెడ్డి, ఎలుబాకలో హమాలీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పిల్లి రవి యాదవ్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. కనపర్తిలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి కార్మికులకు టవల్స్ పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, కార్మికులు వేడుకల్లో పాల్గొన్నారు.
జమ్మికుంట మండలంలో..
మండలంలోని మాచనపల్లి, వావిలాల, తనుగుల, గండ్రపల్లి, శంభునిపల్లి, అంకూషాపూర్ తదితర గ్రామాల్లో మే డే సందర్భంగా సర్పంచులు, ఎంపీటీసీలు, కార్మిక సంఘాల నాయకులు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వీట్లను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాదిరెడ్డి వెంకట్‌రెడ్డి, సర్పంచులు బొజ్జం కల్పనాతిరుపతిరెడ్డి, చిలుముల వసంతారామస్వామి, బలుగూరి పద్మాసమ్మారావు, బోయిని రాజ్‌కుమార్, కనపర్తి వంశీధర్‌రావు, రాజిరెడ్డి, రాచపల్లి సదయ్య, రమారాజయ్య, అన్నపూర్ణ, పరశురాములు, ఆకినపల్లి సుజాతాభద్రయ్య, మహేందర్, శ్రీలత, ఎంపీటీసీలు మర్రి మల్లేశం, తోట కవితాలక్ష్మణ్, పొల్సాని రాజేశ్వర్‌రావు, రాచపల్లి రాజయ్య, మమత, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కనపర్తి లింగారావు, మాజీ సర్పంచులు కనవేన రాజమల్లు, పర్లపల్లి రమేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ మర్రి రాజయ్య, వావిలాల ఖాదీ సూపరింటెండెంట్ నాగమల్ల శ్రీనివాస్, సీపీఎం నాయకుడు చెల్పూరి రాములుతో పాటు తదితరులు పాల్గొన్నారు.