మానకొండూర్ రూరల్, మే 1: పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను వర్తింపజేస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని కొండపల్కలకు చెందిన బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు లంబు రాజేందర్‌రెడ్డికి సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.60వేల చెక్కును ఆదివారం ఎమ్మెల్యే అందజేశారు. అలాగే రాజేందర్‌రెడ్డి తాత లంబు రాజిరెడ్డికి కూడా రూ.48వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు కాగా ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని చెప్పారు.
ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభం
వీణవంక మండలం రెడ్డిపల్లికి చెందిన కనుకం రాజుకు దళితబంధు కింద మంజూరైన ఎలక్ట్రికల్ షాప్‌ను మానకొండూర్ మండలం చెంజర్లలో ఏర్పాటు చేసుకోగా ఆదివారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. షాప్‌ను సక్రమంగా నిర్వహించి ఆర్థికంగా ఎదగాలని లబ్ధిదారుకు సూచించారు.
ఇఫ్తార్ విందుకు హాజరు
మండల కేంద్రంలోని సుప్రీం ఫంక్షన్ హాల్లోఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు.
కొండపల్కలలో విగ్రహావిష్కరణ
మండలంలోని కొండపల్కలలో స్వర్గీయ బండి చిన్న చంద్రయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం చంద్రయ్య సేవలను కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు నల్ల వంశీధర్‌రెడ్డి, మాశం శాలిని-సాగర్, బొల్ల వేణు, ఎంపీటీసీ గడ్డి రేణుక-గణేశ్, జడ్పీటీసీ శేఖర్‌గౌడ్, ఉప సర్పంచ్ తోట రాజమౌళి, ఆర్బీఎస్ గ్రామ కన్వీనర్ కడారి ప్రభాకర్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్, ఇడుమాల సంపత్, గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ తిరుపతిగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షురాలు బొంగోని రేణుక, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బండి సంపత్, మానకొండూర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ పంజాల శ్రీనివాస్‌గౌడ్, మాజీ సర్పంచ్ బైక రాజమౌళి, నాయకులు నరహరి గణపతిరెడ్డి, బండి పెద్ద చంద్రయ్య, కొలిపాక రాయమల్లు, పరశురాములు, రెడ్డి సంపత్‌రెడ్డి, ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, మూల కరుణాకర్‌గౌడ్, విండో డైరెక్టర్లు వాల అంజుత్రావు, బండి రామక్క తదితరులు పాల్గొన్నారు.