కార్పొరేషన్, మే 1: కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మేయర్ వై సునీల్‌రావు పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని బల్దియా కార్యాలయ సమీపంలో టీఆర్ఎస్ మున్సిపల్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మే డే వేడుకలకు మేయర్ ముఖ్య అతిథిగా హాజరై టీఆర్ఎస్కేవీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మేయర్ వై సునీల్‌రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ వివిధ రంగాల పరిశ్రమలను ప్రోత్సహించి కార్మికులను ఆదుకుంటున్నారని తెలిపారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేసి, కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల హకుల కోసం పోరాటం చేస్తున్నదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతో కార్మికులను, ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నదని దుయ్యబట్టారు. కేంద్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలను పెంచి కార్మికుల నడ్డి విరిచిందన్నారు. కేంద్రం కార్పొరేట్ సంస్థల కోసమే పని చేస్తున్నదని విమర్శించారు.
కరీంనగర్లో నగరపాలక సంస్థకు కార్మికుల శ్రమ ద్వారానే కీర్తి ప్రతిష్టలు లభించాయన్నారు. సఫాయి మిత్ర సురక్షా చాలెంజ్‌లో నగరాన్ని కార్మికులు దేశంలో రెండో స్థానంలో నిలిపి రూ.4 కోట్ల ప్రోత్సాహకం దకెలా పనిచేశారని గుర్తు చేశారు. కార్మికుల కష్టంతోనే నగరం పరిశుభ్రంగా ఉండి ప్రజలు మంచి వాతావరణంలో జీవిస్తున్నారని తెలిపారు. కార్మికుల శ్రేయస్సు కోసం బల్దియా పాలకవర్గం పని చేస్తున్నదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నేతికుంట యాదయ్య, మున్సిపల్ కార్మిక విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అలాగే, సుభాష్‌నగర్‌లోని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి రాములు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొని టీఆర్ఎస్కేవీ జెండాను ఆవిష్కరించారు. సంఘం నాయకులు బోయిని చంద్రయ్య, నీర్ల శ్రీనివాస్, పులిపాక లక్ష్మణ్, సురేశ్ పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సరిత సంఘం జెండాను ఆవిష్కరించారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాములు, జిల్లా ప్రభుత్వ దవాఖాన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు వసీం, జనరల్ సెక్రటరీ అతిక్, సిబ్బంది ప్రమీలారాణి, లీలవర్ణ రాజేశ్వరి, సరళ, రాజమ్మ, పూర్ణిమ, సుగుణ, జమున, అరుణ్, సాయి పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, మే 1: నగరంలో వామపక్షాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే ఘనంగా నిర్వహించారు. శాతవాహన యూనివర్సిటీ ఎదుట సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్ సంఘం జెండాను ఎగురవేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కార్మిక చట్టాలను సవరిస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, ముకుందరెడ్డి, రవి, సత్యం పాల్గొన్నారు. స్థానిక లేబర్ అడ్డాలో సీఐటీయూ నాయకురాలు కవిత సంఘం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు మల్లారెడ్డి, జగదీశ్, సమ్మయ్య పాల్గొన్నారు.
జయశంకర్ యూనివర్సిటీ ప్రాంతీయ కార్యాలయంలో సీఐటీయూ నాయకురాలు రాధ సంఘం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు సంపత్, పోచయ్య, గోపి పాల్గొన్నారు. గణేశ్‌నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయం (బద్ధం ఎల్లారెడ్డి భవనం)లో జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న సంఘం జెండాను ఆవిష్కరించారు. నగరంలోని ట్రాన్స్పోర్ట్ హమాలీ సంఘం వద్ద అధ్యక్షుడు సదానందం సంఘం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంపత్, రాంచంద్రం, కుమార్ పాల్గొన్నారు. ప్రకాశం గంజ్‌లోని ఆటో ట్రాలీ వర్కర్స్ యూనియన్ వద్ద అధ్యక్షుడు ప్రభాకర్ సంఘం జెండాను ఎగురవేశారు. నాయకులు వీరయ్య, రాజమల్లు, భీరయ్య పాల్గొన్నారు. ఫర్టిలైజర్ హమాలీ సంఘం వద్ద ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న సంఘం జెండాను ఆవిష్కరించారు. నాయకులు లక్ష్మణ్, రాజు, శంకరయ్య పాల్గొన్నారు. అలాగే, తెలంగాణ కార్మిక సమాఖ్య కార్యాలయంలో మేడే వేడుకలు నిర్వహించారు. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పులేటి లక్ష్మణ్, నాయకులు కొమురయ్య, రమేశ్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
మండలంలోని బొమ్మకల్ సిమెంట్ గోదాంల వద్ద ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య సంఘం జెండాను ఎగురవేశారు. సంఘం నాయకులు బుచ్చన్న, సురేందర్‌రెడ్డి, పైడి రాజు, శ్రీనివాస్, తిరుపతి యాదవ్ పాల్గొన్నారు. తీగలగుట్టపల్లిలోని తిరుమల శ్రీనివాస సౌత్ సెంట్రల్ రైల్వే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ హమాలీ సంఘం వద్ద అధ్యక్షుడు కాశెట్టి లక్ష్మయ్య సంఘం జెండాను ఎగురవేశారు. నాయకులు సదానందం, దాసరి ప్రభాకర్, జంగ శంకర్, గాండ్ల రమేశ్, సతీశ్, గట్టు రవీందర్, గాండ్ల రాజేందర్, రవీందర్, ఆకుల సతీశ్, చిందం తిరుపతి, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. మొగ్దుంపూర్, దుర్శేడ్, చెర్లభూత్కూర్, నగునూర్, చామనపల్లి గ్రామాల్లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న ఆధ్వర్యంలో సంఘం జెండా ఎగురవేశారు. కార్యక్రమాల్లో సంఘం మండల కార్యదర్శులు, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతున్నదని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పేర్కొన్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎలుక అనిత-ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాట్లాడారు. టీఆర్ఎస్కేవీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్, సమ్మయ్య, రాఘవులు పాల్గొన్నారు.
నగరంలోని కేర్ ఫౌండేషన్‌లో అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు పాదరక్షలు పంపిణీ చేశారు. కమిషన్ చైర్మన్ శ్రీరామోజు మధు, ప్రధాన కార్యదర్శి ఎండీ ముజీబ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నామ రమేశ్, వైస్ చైర్మన్లు కనపర్తి సత్యనారాయణ, రాజగోపాల్, తండాల మీనాకుమారి, కరిమి పద్మ, రమ తదితరులు పాల్గొన్నారు.