గన్నేరువరం, ఏప్రిల్ 30: రైతుల సౌకర్యార్థమే తెలంగాణ ప్రభుత్వం గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని, అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని చీమలకుంటపల్లి, పీచుపల్లి, గోపాల్పూర్, హన్మాజీపల్లి, మైలారం, సాంబయ్యపల్లి, చాకలివానిపల్లి, ఖాసీంపేట, పారువెళ్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే ఊరూరా కేంద్రాలను ఏర్పాటు చేసి, మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం నీటితో మండలంలోని చెరువులు, కుంటలను నింపడంతో సస్యశ్యామలమైనట్లు తెలిపారు. రైతులు వరి ధాన్యం దళారులకు అమ్మి నష్టపోవద్దని సూచించారు.
‘కల్యాణలక్ష్మి’ పేదింటి ఆడబిడ్డలకు వరం
కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడ బిడ్డలకు వరం లాంటిదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. తొలి పొద్దు కార్యక్రమంలో భాగంగా శనివారం వేకువ జామునే మండలంలోని గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, చీమలకుంటపల్లి, జంగపెల్లి, ఖాసీంపేట, పారువెల్ల, గన్నేరువరం, గోపాల్పురం, హన్మాజీపల్లి, యాస్వాడ, మైలారం గ్రామాల్లో లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఎమ్మెల్యే రసమయికి మైలారంలో తోట కోటేశ్వర్, ఖాసీంపేటలో గంప వెంకన్న ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లతో నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆడ బిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ. లక్షా నూట పదహార్లు అందజేసి పెద్దన్నలా వ్యవహరిస్తున్నారని కొనియాడారు.
నిరుపేదల సంక్షేమానికి కృషి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు కుసుంబ నవీన, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు తీగల మోహన్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు, వైస్ ఎంపీపీ న్యాత స్వప్నా-సుధాకర్, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ బద్ధం తిరుపతిరెడ్డి, ప్యాక్స్ చైర్మన్ అల్వాల కోటి, సర్పంచులు తీగల మోహన్‌రెడ్డి, గంప మల్లీశ్వరి, కర్ర రేఖ, పీచు చంద్రారెడ్డి, అటికం శారద, చెన్నాల నగేశ్, లింగాల రజిత, దుడ్డు రేణుక, చింతలపెల్లి నర్సింహారెడ్డి, పుల్లెల లక్ష్మి, నక్క మల్లయ్య, జక్కనపెల్లి మధుకర్, నాయకులు ఏలేటి చంద్రారెడ్డి, పుల్లెల లక్ష్మణ్, అటికం శ్రీనివాస్, తోట కోటేశ్వర్, గూడూరి సురేశ్, లింగాల మహేందర్‌రెడ్డి, తోట రాములు, అటికం శ్రీనివాస్, కర్ర కొమురయ్య, పుల్లెల లక్ష్మణ్, గొల్లపెల్లి రవి, మెరుగు రాముగౌడ్, మీసాల ప్రభాకర్, తాడూరి వెంకటరమణారెడ్డి, అటికం రవిగౌడ్, తహసీల్దార్ బండి రాజేశ్వరి, ఎంపీడీవో స్వాతి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆర్బీఎస్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.