కార్పొరేషన్, ఏప్రిల్ 29: నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. నగరంలోని మంచిర్యాల చౌరస్తా సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు మరమ్మతు పనులను శుక్రవారం ఆయన మేయర్ యాదగిరి సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ చొరవతోనే నగరంలోని 14.5 కి.మీ మేర ఆర్అండ్బీ రహదారులన్నీ అభివృద్ధి చెందినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు కరీంనగర్‌పై ఉన్న అభిమానంతో ప్రత్యేక నిధులు కేటాయించడంతోనే రోడ్లను, జంక్షన్లను సుందరీకరించినట్లు పేర్కొన్నారు.
నగరంలో బీటీ రోడ్లతో పాటు డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని తెలిపారు. మంచిర్యాల చౌరస్తా నుంచి నాకా చౌరస్తా వరకు కొంత రోడ్డు చెడిపోవడంతో మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి పనులు ప్రారంభించామన్నారు. పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. మరో 30 సంవత్సరాల భవిష్యత్ ప్రణాళిక ప్రకారం కొత్త మాస్టర్ ప్లాన్ కూడా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కార్పొరేటర్లు మేచినేని వనజ-అశోక్‌రావు, ఎడ్ల సరిత-అశోక్, కంసాల శ్రీనివాస్, కుర్ర తిరుపతి, అర్ష కిరణ్మయి-మల్లేశం, నేతికుంట యాదయ్య, బోనాల శ్రీకాంత్, నక పద్మ-కృష్ణ, వంగల శ్రీదేవి-పవన్, గంట కల్యాణీశ్రీనివాస్, మెండి శ్రీలత-చంద్రశేఖర్, డీఈ మసూద్ అలీ, ఏఈలు పాల్గొన్నారు.
ఉద్యోగుల సంఘ భవన పనులకు శంకుస్థాపన
కలెక్టరేట్, ఏప్రిల్ 29: నగరంలోని బస్టాండ్ వెనుక ప్రాంతంలో నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నూతన భవన నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మేయర్ వై సునీల్ రావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్ రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.