కరీంనగర్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ఆయన హుజూరాబాద్, మానకొండూర్, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల క్లస్టర్, గ్రౌండింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో క్లస్టర్ల వారీగా యూనిట్ల గ్రౌండింగ్‌పై సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, లబ్ధిదారులు నచ్చిన యూనిట్లను ఎంచుకొని ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రోత్సహించాలని అధికాలను ఆదేశించారు. లబ్ధిదారుల ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఇన్వాయిస్, యుటిలైజేషన్ సర్టిఫికెట్లను స్రూటిని చేయాలని సూచించారు.
లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లను ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు, క్లస్టర్ అధికారులు పరిశీలించి, నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, డీటీసీ చంద్రశేఖర్ గౌడ్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, షెడ్యుల్ కులాల అభివృద్ధి అధికారి నతానియేల్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజమనోహర్ రావు, మెప్మా పీడీ రవీందర్, నెహ్రూ యువ కేంద్రం జిల్లా కో-ఆర్డినేటర్ రాంబాబు, జిల్లా పశువైద్యాధికారి నరేందర్, ఎల్డీఎం, క్లస్టర్ అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.