మానకొండూర్, ఆగస్టు 15: 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఊరూరా ఘనం గా జరుపుకొన్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా, స్వచ్ఛం ద సంస్థల ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతాలాపన చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. కొవిడ్ నిబంధనల మేరకు వేడుకలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ ముద్దసాని సులోచన, జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, సీఐ వై.కృష్ణారెడ్డి, విండో చైర్మన్ నల్ల గోవిందరెడ్డి, పీహెచ్సీ వైద్యాధికారి సంధ్యారాణి, పశువుల డాక్టర్ సుష్మిత, ఏఎంసీ చైర్మన్ వాల ప్రదీప్‌రావు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయరావు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
మానకొండూర్ రూరల్, ఆగస్టు 15: మండలంలోని దేవంపల్లి, కొండపల్కల, ముంజంపల్లి, వేగురుపల్లి, వెల్ది, గంగిపల్లి, గట్టుదుద్దెనపల్లి తదితర గ్రామాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
శంకరపట్నం, ఆగస్టు 15: మండల వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ ఉమ్మెంతల సరోజన, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రమేశ్, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఏవో శ్రీనివాస్, ఎస్ఐ ప్రవీణ్‌రాజు, పీహెచ్సీ డాక్టర్ షాకీర్ అహ్మద్, ఎంపీడీవో జయశ్రీ, మోడల్ స్కూల్ ప్రన్సిపాల్ జ్యోతి, కేజీబీవీ ఎస్వో జ్యోతి, వివిధ బ్యాంకుల మేనేజర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
చిగురుమామిడి, ఆగస్టు 15: మండల వ్యాప్తం గా వేడుకలు నిర్వహించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కొత్త వినీత, జడ్పీటీసీ గీకురు రవీందర్, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, తహసీల్దార్ ముబీన్ అహ్మద్, విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, వైద్యాధికారి వసుధా భరద్వాజ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, ఎంఈవో విజయలక్ష్మి, కస్తూర్బా ఎస్వో రజిత, ఇన్చార్జి ఎస్ఐ సాధారావు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
గన్నేరువరం, ఆగస్టు 15: మండల వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ రాజేశ్వరి, ఎస్ఐ తిరుపతి, ఏవో కిరణ్మయి, ఆర్బీఎస్ కోఆర్డినేటర్ బోడ మాధవరెడ్డి, ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్/తిమ్మాపూర్ రూరల్, ఆగస్టు 15: మండల వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఈఎస్సీ శంకర్, ఎంపీపీ కేతిరెడ్డి వనిత, తహసీల్దార్ రాజ్‌కుమార్, డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్, ఎస్ఐ ప్రమోద్‌రెడ్డి, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఇన్చార్జి నాయిని వెంకట్‌రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గొర్రె సత్యనారాయణ యాదవ్, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, ఎంపీడీవో చింతల రవీందర్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.