చొప్పదండి, ఏప్రిల్ 12: తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం చేసిన ప్రకటనపై ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, మండల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతుల తరఫున ఢిల్లీలో నిరసన చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. సీఎం కేసీఆర్‌కు రైతులంతా రుణపడి ఉంటారని పేర్కొన్నారు.
చొప్పదండి, ఏప్రిల్ 12: యాసంగి వరి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ కొలిమికుంటలో సర్పంచ్ తాళ్లపల్లి సుజాత-శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌తో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని అన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సత్తు తిరుపతి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు మల్యాల మహేందర్, వార్డు సభ్యుడు సురేశ్, నాయకులు సత్తు తిరుపతి, సత్తు మోహన్, ప్రశాంత్, లక్ష్మణ్, రాములు, రాజు, కనకయ్య, సత్తయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, ఏప్రిల్ 12 : మండలంలోని బూరుగుపల్లిలో సీఎం కేసీఆర్ కటౌట్‌కు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, నాయకులు దూలం శంకర్‌గౌడ్, ఆకుల మధుసూదన్, వేముల అంజి, లింగారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
సైదాపూర్, ఏప్రిల్ 12: రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సర్వాయిపేట పంచాయతీ పరిధిలోని శివరాంపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయం వల్ల రైతులందరికీ న్యాయం జరుగుతున్నదన్నారు. సర్పంచ్ ఏనుగుల ఐలయ్య, వార్డు సభ్యుడు సది, మాజీ ఎంపీటీసీ ఠాగూర్ అమృత్‌సింగ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పోలు ప్రవీణ్‌కుమార్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు మలుగు సంపత్, నాయకులు మాదం స్వామి, మాదం రమేశ్, గోనెల రాజుకుమార్, ఎస్డీ సర్దార్, మహేశ్, రాజయ్య, ఐలయ్య, సంపత్ ఉన్నారు.