శ్రీ రామనవమి వేడుకలు డివిజన్ వ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఊరూరా మండపాలు వేసి శ్రీ సీతారాముల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. ఆయా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో చలువ పందిళ్లు వేసి, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
హుజూరాబాద్‌టౌన్, ఏప్రిల్ 10: హుజూరాబాద్ పట్టణంతో పాటు విలీన గ్రామాలైన కొత్తపల్లి, బోర్నపల్లి, దమ్మక్కపేట, కేసీక్యాంప్లో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో, పాటిమీది హనుమాన్ ఆలయంలో నిర్వహించిన కల్యాణ వేడుకలకు ముఖ్య అతిథిగా బల్దియా చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ దంపతులు కొలిపాక నిర్మలాశ్రీనివాస్ హాజరయ్యారు. పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ట్రస్ట్ చైర్మన్ క్యాసా చక్రధర్ దంపతులు కల్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ ధర్మకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జమ్మికుంటలో..
మున్సిపల్ పరిధిలోని రైల్వేస్టేషన్ ఆవరణలోగల శ్రీరామాలయంలో రాములోరి కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు వెంకటేశ్వరాచార్యులు, నిఖిలాచార్యుల బృందం ఆధ్వర్యంలో ఉదయం 10గంటల నుంచి కల్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముందుగా హోమం, తర్వాత ఎదుర్కోళ్లు నిర్వహించారు. మధ్యాహ్నం 2గంటల వరకు వేడుకలు జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కల్యాణమూర్తులను దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. తీర్థ ప్రసాద వితరణ, మహాన్నదానంతో కార్యక్రమాలు ముగిశాయి. భక్తుల కోసం ఆలయ కమిటీ చైర్మన్ ఇంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, సభ్యులు సంపత్‌రావు, గణపతి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
హుజూరాబాద్ మండలంలో..
హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 10: మండలంలోని తుమ్మనపల్లి, రంగాపూర్, పోతిరెడ్డిపేట గ్రామాల్లోని ఆంజనేయ స్వామి ఆలయాలు, సిర్సపల్లి, కందుగుల, చెల్పూర్ తదితర గ్రామాల్లోని రామాలయాల్లో ఆదివారం శ్రీసీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆయా ఆలయాల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సైదాపూర్ మండలంలో..
మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సీతారాముల కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా జరిపించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, వరంగల్ ఏఎస్పీ (ఎస్బీ) బెదరకోట జనార్దన్, సింగిల్‌విండో చైర్మన్లు కొత్త తిరుపతిరెడ్డి, బిల్ల వెంకటరెడ్డి, సర్పంచులు తాటిపల్లి యుగేంధర్‌రెడ్డి, కొత్త రాజిరెడ్డి, కాయిత రాములు, పైడిమల్ల సుశీలాతిరుపతిగౌడ్, మ్యాకల శిరీషాముకుందరెడ్డి, రేగుల సుమలతాఅశోక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, ప్రధాన కార్యదర్శి చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ బెదరకోట రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
వీణవంక మండలంలో..
పోతిరెడ్డిపల్లిలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పరిపాటి రవీందర్‌రెడ్డి శ్రీరామనవమి వేడుకల్లో ప్రత్యేక పూజలు చేశారు. చల్లూరు, ఎలుబాక, గంగారం, ఘన్ముక్ల, శ్రీరాములపేట, మామిడాలపల్లి, దేశాయిపల్లి, కనపర్తి గ్రామాల్లో సర్పంచులు పొదిల జ్యోతి రమేశ్, పింగిళి కోమల్‌రెడ్డి, కొత్తిరెడ్డి కాంతారెడ్డి, బండ సుజాత-కిషన్‌రెడ్డి, సునీత-మల్లారెడ్డి, పర్లపెల్లి రమేశ్ సీతారాముల కల్యాణాన్ని ఘనంగా జరిపించగా, భక్తులు పాల్గొని తిలకించారు.
జమ్మికుంట మండలంలో..
మండలంలోని వావిలాల ఖాదీ ప్రతిష్టాన్‌లోని శ్రీరామాంజనేయ స్వామి ఆలయంలో ఖాదీ ప్రతిష్టాన్ సూపరింటెండెంట్ నాగమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు, శ్రీభాష్యం రాజుఆచార్యులు సీతారాముల కల్యాణాన్ని జరిపించారు. సర్పంచ్ జక్కన శ్రీలతాసత్యం, ఎంపీటీసీ మర్రి మల్లేశం, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు పమ్మిడి లింగారావు, మాజీ సర్పంచ్ సంజీవ్, మాజీ ఎంపీటీసీలు స్వప్నాసదానందం, మహేంద్రాచారితో పాటు ఖాదీ ఉద్యోగులు, కార్మికులు, భక్తులు పాల్గొన్నారు.