చొప్పదండి, ఏప్రిల్ 10: మండలంలోని ఆలయాల్లో శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదివారం సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. చొప్పదండిలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో వివేకానంద యువజన సంఘం, రామాలయంలో యంగ్బాయ్స్ యువజన సంఘం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవం జరిపించారు. రామాలయంలోని సీతారాముల విగ్రహాలను పల్లకీలో ఊరేగించారు. అనంతరం ఆలయ ఆవరణలో స్వామి వారి కల్యాణం జరిపించారు. భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూజల్లో వేద పండితులు, వివేకానంద యువజన, యంగ్బాయ్స్ యువజన సంఘం సభ్యులు, హనుమాన్ దీక్షాపరులు, భక్తులు పాల్గొన్నారు. అలాగే, రాగంపేట, భూపాలపట్నం, కొలిమికుంట, చిట్యాలపల్లి తదితర గ్రామాల్లోని ఆలయాల్లో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
గంగాధర, ఏప్రిల్ 10: మండలంలోని బూరుగుపల్లి, మధురానగర్, చెర్లపల్లి(ఆర్), కోట్లనర్సింహులపల్లి, లక్ష్మీదేవిపల్లి, కురిక్యాల, ఉప్పరమల్యాల, మల్లాపూర్, కాసారం, గర్శకుర్తి, గట్టుభూత్కూర్ గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బూరుగుపల్లిలో నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. చెర్లపల్లి(ఆర్)లో జడ్పీటీసీ పుల్కం అనురాధ, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య పాల్గొని స్వామి వారికి పుస్తెమట్టెలు, పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. స్వామి వారి కల్యాణాన్ని ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ పుల్కం గంగన్న, భక్తులు తిలకించారు. బూరుగుపల్లిలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, ఉప్పరమల్యాలలో సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, కురిక్యాలలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, మధురానగర్‌లో సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఉప్పరమల్యాల, చెర్లపల్లి(ఆర్)లో టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, ఆయా గ్రామాల్లో సర్పంచులు వేముల లావణ్య, సాగి రమ్య, పుల్కం స్వరూపారాణి, తోట కవిత, బొల్లాడి మంజుల, ఆకుల శంకరయ్య, వేముల దామోదర్, అలువాల నాగలక్ష్మి, కంకణాల విజేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, దూలం లక్ష్మి, ముద్దం జమున, రజిత, టీఆర్ఎస్ నాయకులు, భక్తులు సీతారాముల కల్యాణాన్ని తిలకించి, మొక్కులు చెల్లించుకున్నారు.
రామడుగు, ఏప్రిల్ 10: వెలిచాలలోని లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో సర్పంచ్ వీర్ల సరోజన-ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం జరిపించారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. మండల కేంద్రంలోని విఠలేశ్వరాలయంలో స్వామి వారి కల్యాణ మహోత్సవానికి సర్పంచ్ పంజాల ప్రమీల- జగన్మోహన్గౌడ్ దంపతులు తలంబ్రాలతో పాటు పుస్తెమట్టెలు సమర్పించారు. గోపాల్‌రావుపేటలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగిన సీతారాముల కల్యాణానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. వన్నారం, కొక్కెరకుంటలోని రామాలయాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణ వేడుకల్లో సర్పంచులు జాడి లక్ష్మి, అభిషేక్‌రెడ్డి పాల్గొన్నారు. రుద్రారం, దేశరాజ్‌పల్లి, తిర్మలాపూర్, తదితర గ్రామాల్లోని రామాలయాల్లో శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 10: బొమ్మకల్‌లోని గోకుల్‌నగర్ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్ర్తాలను జడ్పీటీసీ పురుమల్ల లలిత-శ్రీనివాస్ దంపతులు సమర్పించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దుర్శేడ్ వేణుగోపాల స్వామి ఆలయంలో అర్చకుడు మధుసూదనాచార్యులు ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం జరిపించారు. సర్పంచ్ గాజుల లక్ష్మి-అంజయ్య, ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు, మాజీ ఎంపీటీసీ వేణుమాధవరావు, కోరుకంటి వేణుమాధవ్‌రావు, తోట తిరుపతి, రాంచంద్రం, అశోక్, రామోజు తిరుపతి, సాయిని తిరుపతి, భక్తులు పాల్గొన్నారు. చేగుర్తి వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకులు వెంకటేశ్వరాచార్యులు, నాగేంద్ర శర్మ, లక్ష్మణాచార్యులు, శ్రీనివాసాచార్యులు స్వామి వారి కల్యాణం జరిపించగా, దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ బల్మూరి ఆనందరావు, సర్పంచ్ చామనపల్లి అరుణ-రాజయ్య, ఆలయ పాలక వర్గం, మాజీ ఎంపీటీపీ సరోజ-మల్లేశ్ యాదవ్, సంపత్‌కుమార్, భక్తులు పాల్గొన్నారు. ఎలబోతారంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు సీతారాముల కల్యాణం జరిపించారు.
సర్పంచ్ లక్ష్మి-గౌతం రెడ్డి, కొమురయ్య, చల్ల రామక్క, లింగారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. ఇరుకుల్లలోని భక్తాంజనేయ స్వామి ఆలయ సమీపంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. ఇరుకుల్లలోని పద్మనాయక వృద్ధాశ్రమంలో గల హనుమాన్ ఆలయంలో సీతారాముల కల్యాణాన్ని అర్చకుడు చిగురురాళ్ల మధుసూదనాచార్యులు ఆధ్వర్యంలో జరిపించారు. వెలమ సంఘం నాయకులు, వృద్ధులు పాల్గొన్నారు. మొగ్దుంపూర్లోని హనుమాన్ ఆలయంలో హిందూ యూత్, తాళ్లపల్లి శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం జరిపించారు. చెర్లభూత్కూర్ వేణుగోపాల స్వామి ఆలయంలో సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి దంపతులు, ఉపసర్పంచ్ చిట్కూరి శేఖర్, ఎంపీటీసీ తిరుపతి, కూర నరేశ్ రెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం జరిపించారు. సాయంత్రం అర్చకులు శ్రీనివాసాచార్యులు, సుధాకరాచార్యులు, ప్రభాకరాచార్యలు ఆధ్వర్యంలో రథోత్సవం నిర్వహించారు. జూబ్లీనగర్లోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో సర్పంచ్ రుద్ర భారతీరాములు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం జరిపించారు.
నగునూర్‌లోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం జరిపించగా, సర్పంచ్ ఉప్పు శ్రీధర్, ఉపసర్పంచ్ దామోదర్‌రెడ్డి, ఎంపీటీసీలు సాయిల వినయ్‌సాగర్, అంకమల్ల శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ సాయిల మహేందర్, దీలిప్గౌడ్ పుస్తె మట్టెలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. గోపయ్యగారిపల్లె వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో కస్తూరి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం జరిపించారు. తీగలగుట్టపల్లిలోని కోదండరామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. పూజల్లో కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, కాశెట్టి లావణ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కాశెట్టి శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ మూల రవీందర్‌రెడ్డి, మూల ప్రభాకర్‌రెడ్డి, పాకాల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.