చొప్పదండి, ఏప్రిల్ 9: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలానికి చెందిన 9 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.3 లక్షల 70 వేల విలువైన ఆర్థిక సాయం మంజూరైంది. గంగాధర మండలం బూరుగుపల్లిలోని తన నివాసంలో శనివారం ఆయన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నదని కొనియాడారు. అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన బాధితులు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న వెంటనే సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, సర్పంచులు గుంట రవి, విద్యాసాగర్‌రెడ్డి, ఆర్బీఎస్ కో-ఆర్డినేటర్లు మచ్చ రమేశ్, గుడిపాటి వెంకటరమణారెడ్డి, నాయకులు మహేశుని మల్లేశం, బీసవేని రాజశేఖర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, ఏప్రిల్ 9: అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన పేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని ఆరుగురికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 2,44,500 ఆర్థిక సాయం మంజూరైంది. కాగా, శనివారం ఆయన బూరుగుపల్లిలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని, ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే రవిశంకర్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, సర్పంచ్ వేముల దామోదర్, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.