యాసంగి ధాన్యాన్ని కొనబోమన్న కేంద్రం వైఖరిపై శుక్రవారం మానకొండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. రైతులు, నేతలు తమ ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేసి మోదీ సర్కారు తీరును ఎండగట్టారు. ఇప్పటికైనా కేంద్రం దిగొచ్చి, ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు.
మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 8: వివిధ గ్రామాల్లో రైతులు తమ ఇండ్లపై నల్ల జెండాలను ఎగురవేశారు. మండల కేంద్రంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు తన ఇంటిపై నల్ల జెండాను కట్టి నిరసన వ్యక్తం చేశారు. కొండపల్కలలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్, ఆర్బీఎస్ గ్రామ కన్వీనర్ కడారి ప్రభాకర్, గంగిపల్లిలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ పంజాల శ్రీనివాస్ గౌడ్, ముంజంపల్లిలో సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు నందగిరి మల్లయ్యచారి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ర్యాలీలు తీశారు. పీఎం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ తిరుపతి గౌడ్, నరహరి గణపతి రెడ్డి, దాసరి శ్రీనివాస్, లంబు శ్రీనివాస్, వెంకట రెడ్డి, బ్రహ్మం, దాసరి రాజ్ కుమార్, సంపత్, మాశం సాగర్, మాజీ ఎంపీటీసీ నూనె తిరుపతి, రెడ్డి సంపత్ రెడ్డి, శనిగరం సంపత్, కర్ణాకర్ గౌడ్, కాట నర్సయ్య, మల్లారెడ్డి, ఆకుల మొగిలి, బండ రవీందర్ రెడ్డి, పారుపల్లి సంపత్ రెడ్డి, బండ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ పిట్టల కుమారస్వామి, వార్డు సభ్యులు అనిల్ గౌడ్, మాజీ ఎంపీటీసీ బాలెంకి మల్లేశం, గాజర్ల మల్లారెడ్డి, కే శ్రీనివాస్, లింగారెడ్డి, కొత్త వెంకటరెడ్డి, ఎల్పుగొండ మొగిలి, కుంట పరశురాములు, రైతులు పాల్గ్గొన్నారు.
శంకరపట్నం మండలంలో..
శంకరపట్నం, ఏప్రిల్ 8; టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో మండల కేంద్రం లో ర్యాలీ తీసి ప్రధాన రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. తాడికల్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. పలు గ్రామాల్లో సర్పంచులు తమ ఇండ్లపై నల్ల జెండాలను ఎగురవేసి కేంద్రమే వడ్లను కొనాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, సర్పంచులు పిన్‌రెడ్డి వసంత, ఉడిగె రజిత, చుక్కల రవి, దాసారపు భద్రయ్య, బైరి సంపత్, రంజిత్‌రావు, ఉప సర్పంచ్ హన్మంతు, నాయకులు సతీశ్‌రెడ్డి, సమ్మయ్య, ఆదిత్య, కొత్తపల్లి రవి, కోటి, కుమార్, అలీమొద్దీన్, సుధాకర్, వీరస్వామి, రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
చిగురుమామిడి మండలంలో..
చిగురుమామిడి, ఏప్రిల్ 8: కేంద్రం తీరుపై మండలంలోని పలు గ్రామాల్లో నిరసనలు హోరెత్తాయి. ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు అందె సుజాత, సింగిల్‌విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శి బెజ్జంకి రాంబాబు తదితరులు తమ ఇండ్ల వద్ద నల్లజెండాలను ఎగురవేశారు. మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి వివిధ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, సింగిల్‌విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆర్బీఎస్ గ్రామ కోఆర్డినేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
గన్నేరువరం మండలంలో..
గన్నేరువరం, ఏప్రిల్ 8: మండలంలోని ఖాసీంపేట గ్రామంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో శుక్రవారం రైతులు, టీఆర్ఎస్ నాయకులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను గ్రామంలో ఊరేగించి దహనం చేశారు. అన్ని గ్రామాల్లో రైతులు తమ ఇండ్లపై నల్ల జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గంప మల్లీశ్వరి, గ్రామాధ్యక్షుడు కర్నె చంద్రయ్య, రైతు బంధు సమితి సభ్యుడు జీల తిరుపతి, బద్దం రమణారెడ్డి, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. గన్నేరువరంలోని తహసీల్ కార్యాలయం ఎదుట ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. గుండ్లపల్లిలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి ఆధ్వర్యంలో, గునుకుల కొండాపూర్‌లో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, సర్పంచ్ పుల్లెల లక్ష్మీలక్ష్మణ్, వైస్ ఎంపీపీ న్యాత స్వప్నాసుధాకర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్, ఆర్బీఎస్ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్ మండలంలో..
తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 8: టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ స్టేజీ వద్ద మండల నాయకులు రాజీవ్ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. మోదీ దిష్టిబొమ్మ దహనం చేసి నినాదాలు చేశారు. వరి పంటలు కోసే సమయం వచ్చినా కేంద్రం తెలంగాణ రైతుల మీద వివక్ష చూపుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో రేణికుంటలో ఏఎంసీ చైర్పర్సన్ ఎలుక అనిత, తిమ్మాపూర్ స్టేజీ వద్ద ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రావుల రమేశ్, పాశం అశోక్‌రెడ్డి, పొన్నం అనిల్‌గౌడ్, కొత్త తిరుపతిరెడ్డి, మేడి అంజయ్య, సాయిళ్ల కొమురయ్య, సంపత్, తదితరులు పాల్గొన్నారు.