మల్యాల, ఏప్రిల్ 8 : దేశంలో వన్ నేషన్ వన్ టాక్స్ ఎలా అమలు చేస్తున్నారో అదే విధంగా వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో పండిన మొత్తం వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌చేస్తూ మల్యాల మండల కేంద్రంలో ఎంపీపీ, సర్పంచ్ మిట్టపెల్లి విమల-సుదర్శన్ ఇంటిపై టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల జెండాను చొ ప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఎగురవేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను ఒక విధంగా, పంజాబ్ రైతులను మరో విధంగా చూస్తున్నదని విమ ర్శించారు. దేశవ్యాప్తంగా ఒకే ధాన్య సేకరణ విధానాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పీయూష్ గోయల్ నోటికొ చ్చినట్టు మా ట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శన మని మండిపడ్డారు. వెంటనే తెలంగాణ రైతులకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ తెలంగాణ రైతులను అవమానపరిచారని, తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగం శ్రీనివాస్, జడ్పీటీసీ కొండపలుకుల రాంమోహన్‌రావు, నాయకులు సాగర్‌రావు, రాంలింగారెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి, మల్యాల గణేశ్, ఆసం శివకుమార్, పోతురాజు శ్రీనివాస్, గడ్డం రాజేశ్వర్, కొంక నర్సయ్య, కోటేశ్వర్రావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.